Trisha: జక్కన్న సినిమాలో ఆఫర్ వస్తే త్రిష రిజెక్ట్ చేశారా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళికి (Rajamouli) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. రాజమౌళి మహేష్ (Mahesh Babu) సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుండగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ సైతం రాకపోవడం అభిమానులను ఒకింత తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఏ సినిమాలో కూడా త్రిష నటించలేదనే సంగతి తెలిసిందే.

Trisha

రాజమౌళి డైరెక్షన్ లో త్రిష (Trisha) నటించకపోవడానికి కారణాలు ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. జక్కన్న మర్యాదరామన్న (Maryada Ramanna) సినిమా కోసం త్రిషను సైతం సంప్రదించారని అయితే ఆమె ఆ సినిమాలో సునీల్ కు (Sunil)  జోడీగా నటించడం ఇష్టం లేక ఆఫర్ ను రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అటు త్రిష లేదా ఇటు రాజమౌళి స్పందిస్తే మాత్రమే ఈ వార్తలకు సంబంధించి నిజానిజాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

రాజమౌళి తర్వాత సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా జక్కన్న సినిమాల విషయంలో వేగం పెంచాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీకి గరుడ అనే టైటిల్ జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. మహేష్ బాబు సైతం ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఈ మూవీ కోసం ఎక్కువ సంఖ్యలో డేట్స్ కేటాయించనున్నారని తెలుస్తోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. రాజమౌళి రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ రాజమౌళి అని సమాచారం. రాజమౌళిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

తన సినిమాపై తనే సెటైర్లు వేసుకున్న నారా రోహిత్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus