Trisha: ఫేవరెట్‌ హీరో సినిమాను త్రిష వదులుకుందా? కొత్త వార్త ఏంటంటే?

14 ఏళ్ల తర్వాత త్రిష మళ్లీ బాలీవుడ్‌కి వెళ్తోంది అంటూ.. ఈ మధ్య వార్తలొచ్చాయి. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో త్రిష జోరు బాలీవుడ్‌లో కూడా చూపించబోతోంది అంటూ ఫ్యాన్స్‌ కూడా సంబరపడిపోయారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి సమంత వచ్చింది అంటున్నారు. గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత తన ఎంట్రీ ఈ బాలీవుడ్‌ సినిమాతోనే చేస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ తెరకెక్కించనున్న చిత్రం ‘ది బుల్‌’. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుమారు 25 ఏళ్ల తర్వాత సల్మాన్‌ – కరణ్‌ కలసి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వస్తుంది అంటున్నారు. ఈ లోపు కాస్టింగ్‌ విషయంలో పెండింగ్‌ లేకుండా చూసుకోవాలని టీమ్‌ అనుకుంటోంది. ఎందుకంటే సినిమా షూటింగ్‌ మొదలుపెడితే ఏకధాటిగా పూర్తి చేసేయడం సల్మాన్‌కు అలవాటు.

ఈ క్రమంలో హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ పాత్ర కోసం తొలుత త్రిషను అనుకున్నారు. అయితే ఆమెకు ఇతర సినిమాల డేట్స్‌తో ఈ సినిమా డేట్స్‌ క్లాష్‌ రావడంతో సల్మాన్‌ సినిమాను వదులుకుంటోంది అని తాజా సమాచారం. మామూలుగా అయితే సల్మాన్‌ సినిమాను త్రిష వదులుకోవడం అసాధ్యం. మరి ఎందుకు ఇలా చేస్తోంది అనేది ప్రశ్న. ఆమె తప్పుకుంటే ఆ ప్లేస్‌లోకి సమంతను తీసుకోవాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట.

1988లో జరిగిన ఓ మిలిటరీ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఆపరేషన్ కాక్టస్’ పేరుతో అప్పట్లో మాల్దీవుల అధ్యక్షుడిని రక్షించేందుకు భారత సైన్యం పెద్ద ఆపరేషనే నిర్వహించింది. దాని ఆధారంగానే ‘ది బుల్’ తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో సల్మాన్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపిస్తాడట. ఒకవేళ త్రిష నటిస్తే… 14 ఏళ్లకు ఆమె బాలీవుడ్‌కి వెళ్తున్నట్లు. 2010లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘కట్టమీటా’ అనే సినిమాలో (Trisha) త్రిష నటించింది. ఆ తర్వాత మళ్లీ ఆమె అటువైపు చూడలేదు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus