Trisha: చిరుకి హ్యాండిచ్చింది.. బాలకృష్ణకి ఓకే చెప్పిందట..!

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నారు. బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. వేటపాలెం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది అని ఈ మధ్యనే గోపి ఓ వీడియో ద్వారా తెలియజేసాడు. ఇక ఈ చిత్రంలో శృతీ హాసన్ హీరోయిన్ గా ఎంపికైనట్టు కూడా వార్తలు వినిపించాయి.

ఆమెను సంప్రదించిన మాట నిజమే కానీ ఈ ప్రాజెక్టులో నటించడానికి ఆమె ఓకే చెప్పలేదట. దాంతో త్రిష ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. గతంలో బాలకృష్ణ నటించిన ‘లయన్’ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది.అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘బాడీ గార్డ్’ మూవీలో కూడా నటించింది.అప్పుడు ఉన్న పరిచయంతోనే ఈ ప్రాజెక్టుకి త్రిష ఓకే చెప్పినట్టు టాక్ నడుస్తుంది.

జూన్ 10 న బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. అయితే చిరంజీవి- కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ లో కూడా మొదట త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ ఆమె ఓ ట్వీట్ వేసి ఈ సినిమా నుండీ తప్పుకుంటున్నట్లు తెలిపింది. మరి ఈ ప్రాజెక్టునైనా కంప్లీట్ చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus