మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ‘గురూజీ’ అని పిలుస్తూ ఉంటారు ఎంతోమంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆయన రాసే ప్రతీ మాటకు అర్ధం ఉంటుంది. ఆయన కలం నుంచి జాలువారిన పదాలు ఎక్కడో అక్కడ, ప్రతి ఒక్కరి జీవితంలో వారిని పలకరిస్తాయి. లేదంటే కనీసం ఏదో ఒక సంధర్భంలో గుర్తొస్తాయి. అలాంటి జీవిత సత్యాలను ప్రేక్షకులకు అందిస్తున్న త్రివిక్రమ్ ను నిజంగా అభినందించాలి. మరి ఆయన కలం నుంచి జలు వారిన జీవిత సత్యాల్లో కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి.
1.ప్రేమలో ఒకరి మీద ఒకరికి అనురాగం ఉంటుంది…పెళ్లి తరువాత ఒకరిపై మరొకరికి అధికారం వస్తుంది…2.యుద్దంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం కాదు…
3.ఆకలేసి తినడానికి ఉండి తినకపోవడం ఉపవాసం…
నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా మంచం ఉండి పొడుకోకపోవడం జాగారం…
కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి, తెగనారకడానికి తల ఉండి నరకకపోవడం మానవత్వం…
4.మనకు వస్తే కష్టం….మనకు కావాల్సిన వాళ్ళకు వస్తే నరకం…5.నిజం చెప్పకపోవడం అబద్ధం… అబద్దాన్ని నిజం చెయ్యాలి అనుకోవడం మోసం…6.భార్య అంటే నచ్చి తెచ్చుకునే భాద్యత… పిల్లలు మొయ్యాలి అని అనిపించే భరువు…
7.ఒకడికి ఉంటే కోపం…గుంపుకు ఉంటే ఉధ్యమం…8.నాలెజ్ ఇస్ డివైన్…అంటే నాలెజ్ డివైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్న మాట.9.మనం చేసేది యుద్దం…యుద్దంలో తప్పొప్పులు ఉండవ్…గెలవడం, ఓడిపోవడం మాత్రమే ఉంటాయి.10.పని చేసి జీతం అడగొచ్చు…అప్పు చేసి వడ్డీ అడగొచ్చు…కానీ హెల్ప్ చేసి థాంక్స్ అడగకూడదు.