ఎన్టీఆర్ తో యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేసే పనిలో త్రివిక్రమ్

ఎన్టీఆర్ కలలు కన్నా ప్రాజక్ట్ షూటింగ్ సవ్యంగా సాగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ గతవారం మొదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. రేపటితో ఈ యాక్షన్ సీన్ కంప్లీట్ కానుంది. దీంతో ఒక వారం రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. మే 3వ తేదీ నుంచి రెండో షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఎండల్లో అవుట్ డోర్ షూటింగ్ ఇబ్బంది అవుతుందని రామోజీ ఫిలిం సిటీలో పెద్ద సెట్ వేశారు. రాయ‌ల‌సీమకు చెందిన ఓ గ్రామం సెట్‌ ని దాదాపు రెండెక‌రాల్లో నిర్మిస్తున్నారు. ఈ సెట్ పనులు పూర్తికావచ్చాయి. ఈ సెట్ కోసం 4 కోట్లు ఖర్చు అయిందని సమాచారం.

ఇక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు ప్రధాన పాత్రలందరూ పాల్గొననున్నారు. నెగటివ్ రోల్ చేస్తున్న యంగ్ హీరో నవీన్ చంద్ర కూడా ఈ షూట్ లో జాయిన్ కానున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం అతను పాటల రికార్డింగ్ కోసం ముంబై లో ఉన్నారు. జై లవకుశ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus