కార్తికేయ, నవీన్ పోలిసెట్టి … ఇద్దరిలో త్రివిక్రమ్ ఛాయిస్ ఎవరు..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ చిత్రంతో ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి 1’ రికార్డులనే బద్దలు కొట్టింది. ఇక ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్… ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థల పై కళ్యాణ్ రామ్, చినబాబు లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలుకానుంది.

ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేస్తాడని తెలుస్తుంది. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారట. ఇదిలా ఉండగా… ఈ చిత్రంలో ఓ యంగ్ హీరోకి కూడా సరిపడా పాత్ర రాసాడంట త్రివిక్రమ్. అలా వార్తలు వస్తాయి కానీ… ఏదో క్రేజ్ కోసం మాత్రమే ఓ యంగ్ హీరోని పెడతాడు త్రివిక్రమ్ అనే కామెంట్స్ కూడా ఎప్పటినుండో ఉన్నవే. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే..

ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రంలో కావాల్సిన యంగ్ హీరో పాత్రలకి ‘ఆర్.ఎక్స్ 100’ హీరో కార్తికేయ అలాగే ‘ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ’ హీరో నవీన్ పోలిశెట్టిలలో ఒకర్ని ఎంపిక చెయ్యాలి అనుకుంటున్నాడట. ఇద్దరూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటులు కాబట్టి.. తన సినిమాకి కూడా అదనపు ఆకర్షణ చేకూరుతుంది అని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus