SSMB28: మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ అలా చేస్తున్నారా?

  • September 1, 2022 / 05:05 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ తొలినాళ్ల నుంచి విభిన్నమైన కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ ఆ సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నారు. తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో త్రివిక్రమ్ తారక్ ను కొత్తగా చూపించడంతో పాటు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్షన్ సీక్వెన్స్ తో మహేష్ సినిమా షూట్ ను మొదలుపెట్టారని సమాచారం. అరవింద సమేత షూట్ ను ఏ విధంగా మొదలుపెట్టారో ఈ సినిమా షూట్ ను సైతం అదే విధంగా యాక్షన్ సీక్వెన్స్ తో త్రివిక్రమ్ మొదలుపెట్టారు. గత సినిమాలకు భిన్నమైన కథాంశంతో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కేజీఎఫ్ ఫైట్ మాస్టర్ల నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్ జరుగుతోందని బోగట్టా.

మరోవైపు గత సినిమాలను మించి ఈ సినిమా సక్సెస్ సాధించే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అతడు, ఖలేజా సినిమాలలో ఖలేజా సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. త్రివిక్రమ్ అభిమానులను ఖలేజా సినిమా తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. అయితే మహేష్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అటు మహేష్ ఇటు త్రివిక్రమ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని బోగట్టా. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఆ సినిమాను మించిన సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. మహేష్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద సెంటిమెంట్ మహేష్ మూవీకి ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus