పవన్ కోసం ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్రమ్
- March 11, 2017 / 10:05 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తే అది హిట్ గ్యారంటీ అనే ముద్ర పడిపోయింది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం జల్సా సూపర్ హిట్ కాగా, రెండో చిత్రం అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న వీరి మూడో మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే గత రెండు చిత్రాలకు పాటించిన సూత్రాన్నే ఈ చిత్రానికి త్రివిక్రమ్ పాటిస్తున్నారు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తో త్రివిక్రమ్ భారీ సెట్స్ వేయించారు.
దేవుడే దిగివచ్చినా.. అనే టైటిల్ పరిశీలిస్తున్న మూడో మూవీకి కూడా రవీందర్ తోనే భారీ సెట్ వేయిస్తున్నారు. 5 కోట్ల తో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మితమవుతున్న ఈ సెట్ లో సినిమా ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్, ఈ చిత్రం కంప్లీట్ అయిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా త్రివిక్రమ్ మూవీని ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















