ఎన్టీఆర్,మహేష్ అయిపోయారు..ఇప్పుడు చరణ్, వెంకీ అంటున్నారు..!

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.అతనితో సినిమాలు చెయ్యాలని స్టార్ హీరోలు తహ తహలాడుతుంటారు. ఒకే కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నప్పటికీ.. త్రివిక్రమ్ సినిమాలు ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. ‘అల వైకుంఠపురములో’ చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాకపోయినా ఆ స్థాయిలో వసూళ్ళను రాబట్టి త్రివిక్రమ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది.

అందుకే మహేష్ బాబు వంటి స్టార్ హీరో కూడా త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలని తెగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే ఈ లోపే త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో సినిమా చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తవ్వాలంటే మరో 8 నెలలు లేదా 9 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. అందుకే ఈ గ్యాప్లో మహేష్ తో సినిమా చెయ్యడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరో పక్క రాంచరణ్ మరియు వెంకటేష్ లతో కూడా త్రివిక్రమ్ సినిమాలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది.

గతంలో వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని.. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు వెంకటేష్ తో త్రివిక్రమ్ చిత్రం ఉంటుందని ప్రచారం నడుస్తుంది. అంతేకాదు చరణ్ కు కూడా త్రివిక్రమ్ ఓ కథని వినిపించాడని… అది చరణ్ కు నచ్చడంతో ఓకే చెప్పడాని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఒక్క త్రివిక్రమ్ ఇంతమంది హీరోలతో సినిమాలు ఎప్పుడు చేస్తాడు? అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus