దర్శకులెవరైనా సరే ముందుగా కథ అనుకొని.. ఆ తరువాత దానికి తగ్గట్లుగా నటీనటులను ఎంపిక చేసుకుంటారు. టెక్నిషన్స్ ను ఫైనల్ చేసుకొని ఆ తరువాత షూటింగ్ కు వెళ్తారు. కానీ దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం అలా చేయడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్, కొందరు నటులను ఫిక్స్ చేశారు. టెక్నికల్ కాస్ట్ ను కూడా ఫిక్స్ చేశారు. షూటింగ్ కు సంబంధించి డేట్స్ ఫైనల్ చేశారంటూ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. అసలు ఈ సినిమాకి కథ మాత్రం ఇంకా రెడీ కాలేదట. మహేష్ బాబు-త్రివిక్రమ్ కలిసి ఏ విధమైన సినిమా చేయాలనేది డిసైడ్ అయ్యారు. అక్కడవరకు నిజమే. కానీ ఇప్పటివరకు త్రివిక్రమ్ ఫుల్ లెంగ్త్ నేరేషన్ ఇవ్వలేదట. ఇటీవల షూటింగ్ కోసం గోవాకి వెళ్లిన మహేష్ బాబుతో మరోసారి స్టోరీకి సంబంధించిన డిస్కషన్స్ చేయాలనుకున్నారు త్రివిక్రమ్. కానీ కుదరలేదు. ఇప్పుడు మహేష్ బాబు ఫ్రీ అవ్వాలి.
త్రివిక్రమ్ నేరేషన్ ఇవ్వాలి. ఆ కథను ఫైనల్ చేయాలి. అప్పుడు షూటింగ్ షెడ్యూల్స్ సంగతి. ప్రస్తుతానికైతే స్టార్ కాస్ట్, టెక్నీకల్ కాస్ట్ డేట్ లు బ్లాక్ చేసి ఉంచారు. షూటింగ్ ఎప్పుడు ఉండొచ్చనేది మహేష్ బాబు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!