బన్నీ కోసం ఎన్టీఆర్ ఫార్ములానే రిపీట్ చేస్తున్నాడు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2018 లో చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన ఈ చిత్రం బన్నీని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ చిత్రం తరువాత బన్నీ తన నెక్స్ట్ సినిమా పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికీ చాలా కధలు విన్న బన్నీ, కథ నచ్చకపోతే మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నాడట. ఇప్పటికే విక్రమ్.కె.కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయాల్సి ఉండగా, కథ తనకి సూటవ్వదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసాడు. ఇప్పుడు అదే కథను నానితో తెరకెక్కిస్తున్నాడు విక్రమ్.

తరువాత మారుతీ, పరశురామ్ చెప్పిన కథలు కూడా విని.. నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసాడట. ఇక బ‌న్నీ త్రివిక్ర‌మ్ డైరెక్షన్లో తన తదుపరి చిత్రం చేయబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కూడా త్రివిక్రమ్ తో మూవీ చేయడమే సేఫ్ గేమ్ అన్నట్టు భావిస్తున్నాడట. ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పిన 4 కథలు విని అందులో ఒకటి సెలెక్ట్ చేసాడంట. అందులో కూడా చాలా మార్పులు చెప్పాడంట. అయితే తాజాగా బన్నీని కలిసి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడట త్రివిక్రమ్. బన్నీ కూడా ఇక ఫైనల్ గా ఓకే చెప్పేశాడట. అల్లు అర్జున్ 19 వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయట. త్రివిక్రమ్ గత చిత్రం ‘అరవింద సమెత’ కు మ్యూజిక్ అందించిన తమన్.. ఈ చిత్రానికి కూడా సంగీతం అందించబోతున్నాడట. ఈ చిత్రాన్ని కూడా కూడా దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నాడట త్రివిక్రమ్. ఒక విధంగా చూస్తుంటే ‘అరవింద సమెత’ టీమ్ నే మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడట. అంతే కాదు రిలీజ్ కూడా ‘అరవింద సమెత’ లాగా దసరాకే ప్లాన్ చేయడం వంటివి చూస్తుంటే, త్రివిక్రమ్ సేమ్ ఫార్ములానే అప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus