Trivikram, Mahesh Babu: ఆ విమర్శలే త్రివిక్రమ్ విషయంలో రిపీట్ అవుతున్నాయా?

సాధారణంగా చాలామంది దర్శకులతో పోల్చి చూస్తే త్రివిక్రమ్ వేగంగానే సినిమాలను తెరకెక్కిస్తారనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాలలో గ్రాఫిక్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు కాబట్టి ఆయన సినిమాలకు మరీ భారీగా బడ్జెట్ ఖర్చు కాదు. అయితే ఇతర హీరోలతో వేగంగానే సినిమాలను తెరకెక్కించే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో మాత్రం నిదానంగా సినిమాలను తీస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ అతడు కాగా ఈ సినిమా బుల్లితెరపై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాకు మురళీ మోహన్ నిర్మాతగా వ్యవహరించగా థియేట్రికల్ కలెక్షన్ల ద్వారా ఆయనకు మాత్రం ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు. బడ్జెట్ అంతకంతకూ పెరిగిపోవడం, ఎక్కువ రోజులు షూటింగ్ జరగడం వల్ల అతడు మూవీకి చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలను అందుకోలేదని మురళీమోహన్ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఆ తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఖలేజా మూవీ తెరకెక్కింది. ఈ సినిమా కూడా బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

శింగనమల రమేష్ బాబు, సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు జరగడంతో పాటు బడ్జెట్ కూడా పెరిగింది. ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో కమర్షియల్ గా కూడా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా తర్వాత మహేష్ అనుష్క కాంబినేషన్ లో మరో మూవీ రాలేదు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సైతం ఇదే రిపీట్ అవుతోంది. ఇప్పటికే ఒక కథ అనుకుని ఆ కథను మార్చడంతో నిర్మాతలకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టం వచ్చిందని తెలుస్తోంది.

ఈ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరుగుతోందని సమాచారం. పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమాకు ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసే త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో కూడా అదే రూల్ ను ఫాలో అవుతున్నారు. మహేశ్ త్రివిక్రమ్ కాంబోలో ప్రతి సినిమాకు త్రివిక్రమ్ షూటింగ్ ఆలస్యం చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus