చిత్ర బృందాన్ని కఠినంగా హెచ్చరించిన త్రివిక్రమ్ శ్రీనివాస్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్స్ లో చాలా కూల్ గా ఉంటారు. పెద్దగా అరవడాలు.. వార్నింగ్  ఇవ్వడాలు ఉండవు. ఏ విషయాన్నైనా సున్నితంగా చెబుతుంటారు. అదే అతనికి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆవేశపరుడిని చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత చిత్రం అజ్ఞాతవాసి ఫెయిల్ అవడంతో ఈసారి హిట్ కొట్టాలని కసితో ఈ సినిమాని అంచనాలకు అందకుండా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రీకరణకు సంబంధించిన ఒక ఫోటో రీసెంట్ గా లీక్ అయింది. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఫోటో కావడంతో సోషల్ మీడియాలో వీర విహారం చేసింది.

అది కూడా కీలకమైన ఫోటో.. ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తున్న నాగబాబు చావు బతుకుల్లో ఉండగా తారక్ తాపత్రయపడే ఫోటో అది. ఇది కథని ముందే ఆడియన్స్ కి చెప్పేలా ఉంది. అందుకే త్రివిక్రమ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఎవరూ షూటింగ్ స్పాట్ కి మొబైల్స్ తీసుకురావద్దని ఆజ్ఞ జారీచేశారు. పైగా షూటింగ్ ఫీల్డ్ లో యూనిట్ సభ్యులు మినహా ఔటర్స్ ని రాకుండా చేయాలనీ ప్రొడక్షన్ టీమ్ ని హెచ్చరించారు. ఈ నిర్ణయం వల్ల లీకులు ఆగుతాయని డైరక్టర్ భావిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ అక్టోబర్ 11 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus