హీరో రామ్ కి గోల్డెన్ ఛాన్స్..?

ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ నుండి ఎప్పుడు బయటపడతారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ పూర్తయినా.. పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే వరకు గెటప్స్ మార్చకూడదని రాజమౌళి రూల్ పెట్టడంతో.. త్రివిక్రమ్ మరింతగా ఎదురుచూడాల్సిన పరిస్థితి.

జనవరికైనా ఎన్టీఆర్ అందుబాటులోకి వస్తాడని త్రివిక్రమ్ భావించాడు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. దీంతో త్రివిక్రమ్ ఓ మీడియం బడ్జెట్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. గతంలో నితిన్ హీరోగా ‘అ ఆ’ అనే సినిమా చేసినట్లు ఇప్పుడు హీరో రామ్ తో మరో సినిమా ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. రామ్ కూడా ఇప్పటివరకు తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘రెడ్’ సినిమా రిలీజ్ అయిన తరువాత నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాడు.

అందుకే మారుతి, సురేందర్ లాంటి దర్శకులకు కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో తనకు త్రివిక్రమ్ తో ఛాన్స్ వస్తే రామ్ పొజిషన్ మరింత పెరుగుతుంది. పైగా రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ కి త్రివిక్రమ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. స్రవంతి మూవీస్ లో నిర్మించిన చాలా సినిమాలకు త్రివిక్రమ్ పని చేశారు. ఆయన దర్శకుడిగా పరిచయమైంది కూడా ఈ బ్యానర్ లోనే. కాబట్టి రామ్ సినిమా కూడా ఇదే బ్యానర్ లో తీసే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus