‘ఎన్టీఆర్’ తో త్రివిక్రమ్ ప్రయోగం..!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ మ్యానియా రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంది…వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ తన సహచర హీరోలకు మంచి గట్టి పోటీ ఇస్తూ తన రేంజ్ ను నిలుపుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరించి. ఫర్స్ట్ సీసన్ ను మంచి బ్రహ్మాండంగా ముగించిన ఎన్టీఆర్…రెండో సీసన్ లో కూడా ఈ షో ని హోస్ట్ చేస్తాడా లేదా? అన్న సందేహం అందరిలో ఉంది…అయితే ఈ షో ని హాట్ చెయ్యడానికి ఎన్టీఆర్ కి కుదరదు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది…దానికి గల కారణాలు ఏంటి అంటే…ఎన్టీఆర్ ఈ షో హాట్ చెయ్యకపోవడం వెనుక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హస్తం ఉందని తెలుస్తుంది…అదేంటి దీనికి త్రివిక్రమ్ కి ఏంటి సంభంధం అని విషయం లోకి వెళితే…యంగ్ టైగర్ ‘బిగ్‌ బాస్ 2’ ఆఫర్‌ను రిజెక్ట్ చేయడం వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నట్టు సమాచారం.

అదే క్రమంలో…ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం త్రివిక్రమ్ తో చేయబోతున్న మూవీ అని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. దీనితో ‘బిగ్‌ బాస్ 2’ షోను హోస్ట్ చేయడం ద్వారా ఎన్టీఆర్ లుక్ లీక్ అవుతుందనే భయం త్రివిక్రమ్ కు ఉంది అని టాక్.  అంతేకాకుండా ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడానికి యంగ్ టైగర్ విదేశాలకు కూడా జూనియర్ వెళ్తున్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో త్రివిక్రమ్ సినిమా ఎన్టీఆర్‌ కు ఒక కొత్త ప్రయోగం లాంటిది అని అంటున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందే ఈ సినిమా కోసం పూర్థిస్థాయి సమయాన్ని కేటాయించాలని జూనియర్ భావిస్తున్న నేపధ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఎన్టీఆర్ బిగ్ బాస్ సీసన్2 చేసే అవకాశం లేదట…మొత్తానికి అదీ మ్యాటర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus