ఏంటీ.. హీరో లేకుండా సినిమా షూటింగా? టైటిల్ చూసి ఈ మాట అడుగుదాం అనుకుంటున్నారా? అలా తెరకెక్కుతున్న ఓ సినిమా రిఫరెన్స్ చూసి కూడా అడుగుతున్నారు అంటే.. కచ్చితంగా ఈ వార్త మీ కోసమే. అంతేకాదు తెలిసినవాళ్లకు ఇదే కోవలోకి మరో వార్త వస్తోంది అని చెబుతున్నాం కాబట్టి.. అందరికీ ఈ వార్త అని చెప్పాలి. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ‘ఓజీ’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే స్టైల్‌లో ‘గుంటూరు కారం’ తెరకెక్కిస్తారు అని అంటున్నారు.
‘ఓజీ’ సినిమా ఇప్పటికే 50 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుందని ఇటీవల టీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో అంత త్వరగా ఎలా సాధ్యం అనే ప్రశ్న వినిపించింది. దానికి సమాధానం.. పవన్ ప్రత్యక్షంగా అవసరం లేని సన్నివేశాలను డూప్‌లతో తెరకెక్కిస్తున్నారని ఓ టాక్ నడుస్తోంది అని చెప్పాలి. సినిమా సన్నిహిత వర్గాల నుండి ఈ మేరకు సమాచారం వస్తోంది. గతంలో యాక్షన్ సన్నివేశాల్లో డూప్‌ను పెట్టిన చేసేవారు. రిస్కీ షాట్ల విషయంలోనే ఈ పని చేసేవారు. అయితే ఇప్పుడు కొన్ని సాధారణ సన్నివేశాలు కూడా అలాగే అవుతున్నాయట.
ఇప్పుడు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా విషయంలోనూ త్రివిక్రమ్ ఇదే స్టైల్‌ను ఫాలో అవుతారని ఓ టాక్ నడుస్తోంది. ఈ సినిమా మొదలై చాలా రోజులు అవుతోంది. కొన్ని రోజులు త్రివిక్రమ్ కోసం, మరికొన్ని రోజులు కథలు మార్పులు కోసం, ఇంకొన్ని రోజులు మహేష్ కోసం వాయిదాలు పడుతూ ఉంది. తాజాగా మరోసారి మహేష్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో మరోసారి వాయిదా పడింది. అయితే మహేష్ వచ్చేలోపు కొన్ని డూప్ సన్నివేశాలు తెరకెక్కిస్తారు అని తాజాగా సమాచారం వస్తోంది.
ఇలాంటి విషయాల్లో కన్‌ఫర్మేషన్, అనౌన్స్‌మెంట్‌లు ఉండవు కాబట్టి.. రావు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఏడాదిన్నర క్రితం మొదలైంది. ఇంకా షూటింగ్ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. గుంటూరు – విజయవాడ పరిసర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉంటుంది అని అంటున్నారు.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!