Trivikram, Mahesh Babu: మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా కథపై ఇంట్రెస్టింగ్‌ రూమర్‌.. నిజమైతే సూపర్‌!

సినిమా మొదలై ఓ షెడ్యూల్‌ పూర్తయ్యాక కూడా ఆ సినిమా కథ గురించి చర్చ జరుగుతోంది అని అంటే.. అది కచ్చితంగా మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా అనే చెప్పాలి. సోషల్‌ మీడియాలో, సినిమా వర్గాల్లో, ఫ్యాన్స్‌ గ్రూపుల్లో ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. అదేంటి కథ మొత్తం వినకుండా, ఓకే అనుకోకుండా మహేష్‌ ఆ సినిమా స్టార్ట్‌ చేశారా? హీరో ఓకే అనకుండా త్రివిక్రమ్‌ ముందుకెళ్లారా?

ఈ ఇద్దరూ క్లారిటీ ఇవ్వకుండా నిర్మాత సినిమా మొదలెట్టేశారా అంటే.. ఏమో అనే సమాధానమే ఇవ్వాల్సి వస్తుంది. #SSMB28 అంటూ గత కొన్ని నెలలుగా వినిపిస్తూ వచ్చిన ఈ సినిమా షూటింగ్‌ ఆ మధ్య ఘనంగా లాంఛనంగా మొదలైంది. సినిమా అదిగో, ఇదిగో అంటూ నెలల తరబడి వాయిదా వేసి ఆఖరికి మొదలుపెట్టారు. కానీ మళ్లీ ఆపేశారు. ఆ విషయాలు పక్కనపెడితే.. ఇప్పుడు ఆ సినిమా కథ పూర్తిగా మార్చేస్తున్నారు అని టాక్‌.

యాక్షన్‌ సినిమాల మీద బోర్‌ కొట్టిందో ఏమో.. ఈసారి ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిటీ ఎంటర్‌టైనర్‌ తీయాలని మహేష్‌ ఫిక్స్‌ అయ్యారట. దాంతోనే కథలో మార్పులు అంటున్నారు. కొత్త కథ గురించి వస్తున్న పుకార్లు వింటే ఈ విషయం తెలిసింది. ఒకే దర్శకుడు… రెండు రకాల కథలు అంటే అది త్రివిక్రమే అని చెప్పాలి. ఫుల్‌ మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో బలమైన ఎమోషన్లు ఆయన సొంతం. ఇప్పుడు మహేష్‌బాబు సినిమా కోసం రెండో ఆప్షన్‌ను ఎంచుకున్నారట.

 పగలూ, ప్రతీకారాలు లేకుండా చక్కటి, చిక్కటి కుటుంబకథా చిత్రం తీయాలని మహేష్‌, త్రివిక్రమ్‌ ఫిక్స్‌ అయ్యారట. సంక్రాంతి తర్వాత ఈ సినిమా మొదలవుతుందట. అచ్చమైన తెలుగు లోగిళ్ల కథగా సినిమా ఉంటుందని టాక్‌. ఈగోల వల్ల వచ్చిన సమస్యల నేపథ్యంలో సినిమా ఉంటుందట.అయితే మహేష్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా చిన్నపాటి యక్షన్‌, వన్‌లైనర్స్‌, కాస్త రొమాన్స్‌ను యాడ్‌ చేస్తారట. గుంటూరు పరిసర ప్రాంతాల్లో సినిమా సాగుతుంది అని కూడా అంటున్నారు. బావ మరదళ్ల మధ్య సాగే కథ అని కూడా సమాచారం. చూద్దాం త్వరలో ఇంకెన్ని పుకార్లు వస్తాయో, వాటిలో ఎన్ని నిజాలవుతాయో.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus