Trivikram: జెట్ స్పీడ్ లో ఉన్న త్రివిక్రమ్.. సగం పని పూర్తయ్యిందట..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ పేరు చెప్పగానే ప్రతీ ఒక్కరి మైండ్లో ప్రాసలు, పంచ్ డైలాగులు మెదులుతుంటాయి. ఈయన తీసే సినిమాల్లో రిపీట్ కంటెంట్ ఉన్నప్పటికీ.. సంభాషణలతో మాయాజాలం చేస్తుంటాడు. అందుకే త్రివిక్రమ్ సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంటాయి. రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో డిమాండ్ ఉన్న టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా నటిస్తున్న ‘అయ్యపనం కోషియం’ రీమేక్ కు సంభాషణలు అందిస్తున్నాడు.

సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పవన్ కోరిక మేరకు త్రివిక్రమ్ పనిచేస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రం నిర్మాతలైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు కూడా త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం షూటింగ్…జూలై 11న తిరిగి ప్రారంభం కానుంది.మరోపక్క మహేష్ బాబుతో కూడా త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే మహేష్ ముందుగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది.

దాని కోసం 3 నెలల వరకు కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే మహేష్ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ను దాదాపు పూర్తి చేసాడట త్రివిక్రమ్. మరో 15 రోజుల్లో స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టి.. అక్టోబర్ నాటికి షూటింగ్ ను ప్రారంభించాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus