నెట్ ఫ్లిక్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీజనల్ కంటెంట్ మీద కోసం దృష్టి పెడుతూ తమ పాపులారిటీను మరింత పెంచుకుంటుంది నెట్ ఫ్లిక్స్ సంస్థ. కొన్నేళ్ల ముందు నుండే హిందీలో సిరీస్ లు రూపొందిస్తోంది. అలానే తమిళంలో కూడా కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు తెలుగులోకి అడుగుపెట్టబోతుంది. ‘బాహుబలి’కి కొనసాగింపుగా అనుకున్న సిరీస్ వర్కవుట్ అవ్వలేదు. దీంతో ‘లస్ట్ స్టోరీస్’ను తెలుగులో ‘పిట్ట కథలు’ అనే పేరుతో రిలీజ్ చేస్తుంది.
ఫిబ్రవరి 19న స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమవుతోంది నెట్ ఫ్లిక్స్. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. రెండు రోజులుగా తెలుగులో ట్వీట్లు వేస్తూ తెలుగు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ‘నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ మీ ముందు’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఇది ‘ఆహా’ టీమ్ కి నచ్చినట్లుగా లేదు. నెట్ ఫ్లిక్స్ కి కౌంటర్ ఇస్తూ.. ”మా దగ్గర చాలా ఒరిజినల్స్ ఉన్నాయి.. అరుస్తున్నామా..?” అంటూ పోస్ట్ పెట్టింది.
దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ‘ఆహా’ ఇచ్చిన కౌంటర్ కి నెటిజన్లు రివర్స్ లో పంచ్ లు వేస్తున్నారు. ‘ఒరిజినల్ కంటెంటా..? అన్నీ డబ్బింగ్ సినిమాలే కదా’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ‘నెట్ ఫ్లిక్స్ తెలుగులో సిరీస్ చేస్తుంటే.. మీ బాధ ఏంటో..?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రకరకాల ఫన్నీ మీమ్స్ ని షేర్ చేస్తూ ‘ఆహా’ని ఆడేసుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ కి కౌంటర్ ఇద్దామనుకున్న ‘ఆహా’ ఇప్పుడు ట్రోలింగ్ బారిన పడక తప్పలేదు.