Chiranjeevi: మెగాస్టార్ తో కాపీ డైలాగ్ చెప్పించారు!

సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెండు రోజుల క్రితమే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి మాస్ గెటప్, ఆయన మేనరిజమ్స్, డైలాగ్స్ అన్నీ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. వింటేజ్ చిరంజీవిని గుర్తు తెచ్చేలా విజువల్స్ అన్నీ ఉన్నాయి. ట్రైలర్ లో పంచ్ డైలాగ్స్ కూడా బాగానే పేలాయి. అందులో ఒక డైలాగ్ ‘నేను రికార్డుల్లో ఉండ‌డం కాదు..

రికార్డులే నా పేరు మీద ఉంటాయి’ అంటూ చిరు చెబుతారు. ఫ్యాన్స్ అందరూ ఈ డైలాగ్ తో బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ డైలాగ్ కొత్తది కాకపోవడం.. ఆల్రెడీ ఒక సినిమాలో ఉన్నదే కావడంతో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విన్నర్’ సినిమాలో ఇదే డైలాగ్ వినిపిస్తుంది. 2017లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘విన్నర్’ సినిమాలో క‌మెడియ‌న్ పృథ్వీ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించారు.

అందులో ఆయన పాత్ర పేరు సింగం సుజాత. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లినప్పుడు ‘రికార్డ్స్ లో నా పేరు ఉండడమేంట్రా.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. సుజాత.. సింగం సుజాత’ అంటూ ఒక డైలాగ్ వేస్తాడు. ఈ డైలాగ్ లో మార్పులు కూడా చేయకుండా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో చిరంజీవితో చెప్పించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెండు వీడియోలను పక్కపక్కన పెట్టి..

మరీ ఇంతలా ఎలా కాపీ చేశారంటూ విమర్శిస్తున్నారు. ఒకప్పుడు సంగతి వేరు.. ఇప్పుడు సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ఎవరైనా ఏదైనా కాపీ చేస్తుంటే వెంటనే దొరికేస్తున్నారు. ఈ విషయంలో ఫిల్మ్ మేకర్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచింది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus