టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో భిన్నమైన కథలను ఎంచుకుంటున్న వాళ్లకు ఎక్కువగా అవకాశాలు పెరగడంతో పాటు విజయాలు దక్కుతున్నాయి. నిఖిల్, విశ్వక్ సేన్, అడివి శేష్ మరి కొందరు హీరోలు ఈ విధంగా విజయాలు సొంతం చేసుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం కూడా భిన్నమైన కథలను ఎంచుకుంటున్నా ఒక సినిమా హిట్టైతే రెండు సినిమాలు ఫ్లాప్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మీటర్ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి సైతం నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.
మాస్ సినిమాల మాయలో పడి కిరణ్ అబ్బవరం కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మీటర్ సినిమా బుకింగ్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన కిరణ్ అబ్బవరం కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. వేగంగా సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడం ద్వారా విజయాలు ఎక్కువగా దక్కే అవకాశాలు ఉంటాయి.
పెద్ద బ్యానర్లలో ఆఫర్లు వస్తున్న కిరణ్ అబ్బవరం సరిగ్గా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే అవకాశం ఉంది. వరుసగా ఫ్లాప్ లు వస్తే మాత్రం కిరణ్ అబ్బవరం మార్కెట్ తగ్గుతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. మీటర్ సినిమాలో మ్యాటర్ లేదు అంటూ కొంతమంది చేస్తున్న ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.
మంచి కథలను ఎంచుకుంటే కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నాని, అడివి శేష్ స్థాయికి చేరుకుంటాడని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ పరంగా తప్పటడుగులు వేయకుండా కిరణ్ అబ్బవరం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కిరణ్ అబ్బవరం తర్వాత ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!