Bro Movie: సాయి ధరమ్ తేజ్ ఇంకా కోలుకో లేదా?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మంచి డాన్సర్. మొదటి సినిమా నుండీ తన డాన్సులతో ఆకట్టుకుంటూ వచ్చాడు.చూడటానికి చిరంజీవిలా ఉంటాడు.. అలాగే తన డాన్సులతో కూడా చిరంజీవిని తలపిస్తూ ఉంటాడు. ప్రతిరోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ వంటి సినిమాల వరకు తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు.రిపబ్లిక్ లో డాన్స్ లకి స్కోప్ లేదు. విరూపాక్ష లో కూడా ఆశించిన స్థాయిలో లేదు. విరూపాక్ష కథ, నేపథ్యం ప్రకారం అందులో కూడా డాన్స్ లు అవసరం లేదనే చెప్పాలి.

అయితే నిన్న (Bro Movie) బ్రో నుండీ మై డియర్ మార్కండేయ అనే పాట రిలీజ్ అయ్యింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కాళ్ళు కదపడం తప్ప.. బాడీని కధపలేకపోయాడు. దీనిని బట్టి సాయి ధరమ్ తేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు అని స్పష్టమవుతుంది. 2021 సెప్టెంబర్ 10 న సాయి ధరమ్ తేజ్ కి భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. దాంతో అతను షాక్ లోకి వెళ్ళిపోయాడు. కోలుకోవడానికి చాలా టైం పట్టింది.

ఈ క్రమంలో అతను ఫిట్ నెస్ కూడా కోల్పోయాడు. మెడిసిన్స్ తీసుకుంటూ మరీ విరూపాక్ష షూటింగ్ లో పాల్గొన్నాడు. అతని కష్టానికి తగ్గ ఫలితం ఆ సినిమా ఇచ్చింది. బ్రో సినిమా విషయంలో కూడా అతను చాలా ఇబ్బందులు పడినట్టు తాజాగా రిలీజ్ అయిన మార్కండేయ పాట ద్వారా స్పష్టమవుతుంది. మరి ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటన ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus