ఆర్ఆర్ఆర్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాలతో విడుదలై ఆ అంచనాలకు తగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి అగ్నిపరీక్ష మొదలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్పటికే చూడాలని అనుకున్న వాళ్లు థియేటర్లలో చూసేశారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు తగ్గినా వీక్ డేస్ కావడంతో ఆడియన్స్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ ఓటీటీ వార్తల వల్ల కూడా కొంతమంది ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపడం లేదు.
ఇప్పటికే ఈ సినిమాను చూసిన వాళ్లు థియేటర్లలో మళ్లీ చూడటానికి ఆసక్తి చూపడం లేదు. మరోవైపు కొత్త సినిమాలు రిలీజవుతుండటం కూడా ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా మరికొన్ని ఏరియాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేదు. ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి2 కలెక్షన్లను బీట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నా ఈ సినిమా బాహుబలి2 కలెక్షన్లను కొన్ని ఏరియాల్లో బీట్ చేయడం కష్టమేనని సమాచారం.
ఫుల్ రన్ లో ఈ సినిమా 1200 కోట్ల రూపాయలకు అటూఇటుగా గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం అయితే ఉంటుంది. గని మూవీకి హిట్ టాక్ వస్తే ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు కొంతమేర తగ్గే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ చరణ్, తారక్ కెరీర్ కు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తో నిర్మాత దానయ్యకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయని బోగట్టా. దానయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు కూడా ఈ సినిమా సక్సెస్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
రాజమౌళికి ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగింది. రాజమౌళి మహేష్ సినిమాను కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?