Naga Chaitanya: బుల్లితెర పై అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసిన ‘లవ్ స్టోరీ’..!

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ బ్యానర్ల పై నారాయణ దాస్ కె నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి పవన్ సి.హెచ్ సంగీతం అందించాడు. పాటలన్నీ విడుదలకి ముందే రికార్డులు కొల్లగొట్టాయి. ‘సారంగ ధరియా’ పాట అయితే మిలియన్ల మీద మిలియన్ల వ్యూస్ ను నమోదు చేసి సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా.. రోజుకి మూడు షోలు మాత్రమే పడిన టైములో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టి.. టాలీవుడ్ కు కొత్త ఊపుని తీసుకొచ్చింది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం $1 మిలియన్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న స్టార్ మా లో టెలికాస్ట్ చేయగా దానికి అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యింది. ఆదివారం నాడు సినిమా టెలికాస్ట్ అవ్వడంతో సినిమాన్ని టీవీల్లో జనాలు బాగా చూసారు.

దాంతో 18.01 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది ‘లవ్ స్టోరీ’ చిత్రం. విడుదలైన 4,5 వారాలకే ఈ చిత్రం ‘ఆహా’ ఓటిటిలో రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు ఈ రేంజ్ టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చెయ్యడం అంటే మాటలు కాదు.ఈ చిత్రం శాటిలైట్ హక్కుల్ని రూ.8.5 కోట్లకి కొనుగోలు చేసారు స్టార్ మా వారు. మొదటి సారి టెలికాస్ట్ తో వారు పెట్టిన మొత్తం రికవర్ అయిపోవడమే కాకుండా లాభాల్ని కూడా అందించింది ‘లవ్ స్టోరీ’ చిత్రం.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus