నాకూ మా నాన్నకు గొడవేంటి… సో ఫన్నీ : బన్నీ

అల్లు అర్జున్ ప్రస్తుతం.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకుని ఈ చిత్రం చేస్తున్నాడు బన్నీ. ఇదిలా ఉండగా.. తన తండ్రి అల్లు అరవింద్ తో బన్నీకి మనస్పర్ధలు వస్తున్నాయని గత కొంతకాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ ఇమేజ్ ను బ్యాలన్స్ చేస్తూ సినిమాలు చేయమని, ప్రయోగాత్మక చిత్రాల జోలికి పోవొద్దని అల్లు అరవింద్ తరచూ అల్లు అర్జున్ కు సలహాలిస్తూ.. అలాగే తన తరువాతి చేయబోయే సినిమా కథ విషయంలో అల్లు అరవింద్ ఇన్వాల్వ్ అయ్యి ఏదీ ఓకే చేయనివ్వడం లేదని వార్తలొచ్చాయి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం చేయడం అల్లు అరవింద్ కు ఇష్టం లేదని. చివరికి ఆ చిత్రం డిజాస్టర్ అయ్యాక.. అల్లు అరవింద్ ఒత్తిడి బన్నీ పై మరింత పెరిగిందని కూడా వార్తలొచ్చాయి. అందుకే బన్నీ కొత్త ఆఫీస్ కూడా తీసుకున్నాడనే టాక్ కూడా నడిచింది. తాజాగా వీటిపై అల్లు అర్జున్ స్పందించాడు.

ఇటీవల ఓ గల్ఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ ఈ విషయం పై స్పందిస్తూ… ”నాన్నతో నాకు పడడం లేదని ఈ మధ్య తెగ వార్తలు వచ్చాయి. అవి నేను కూడా చదివా.. నేను, నాన్న ఒకే ఇంట్లో ఉంటున్నాం. రెగ్యులర్ గా చాలా విషయాల పై మేం చర్చించుకుంటాం. అలాంటిది మా మధ్య గొడవలేంటి..? ఈ వార్తలు చూసి చాలా నవ్వుకున్నాం.. ఫన్నీగా అనిపించాయి” అంటూ క్లారిటీ ఇచ్చాడు.దీనితో పాటూ… ‘కొన్నిసార్లు నా గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తూ.. నా లుక్స్ ని పరిశీలించుకుంటూ.. ప్రతి సినిమాలో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఆలోచిస్తుంటాను. ఇక వారసత్వం గురించి మాట్లాడుతూ.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా.. టాలెంట్, కష్టపడే మనస్తత్వం ముఖ్యమని.. ప్రతిభ ఉన్నవాళ్ళే ఇండస్ట్రీలో కొనసాగుతారని’ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus