న్యాచురల్ స్టార్ నాని ఎలాంటు సినిమా చేసినా కూడా బాక్సాఫీసు వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కరోనా లాక్డౌన్ అనంతరం నాని చేసిన రెండు సినిమాలు కూడా థియేటర్లోకి లేకపోవడం విశేషం. నిజానికి నాని కంటే చిన్న సినిమాల హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద నమ్మకంతో భారీ విజయాన్ని అందుకున్నారు. కానీ నాని నిర్మాతలు మాత్రం అందుకు పెద్దగా ధైర్యం చేయలేదు. మొత్తానికి ఈ సినిమా తర్వాత జగదీష్ కూడా అమెజాన్ ప్రైమ్ లో ని విడుదలైంది.
అయితే ఈ రెండు సినిమాలు కూడా విడుదలైన తర్వాత ఎక్కువగా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. బిజినెస్ విషయంలో అయితే మంచి లాభాలను అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 34 కోట్ల వరకు ఒక బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ హక్కుల ద్వారా 37 కోట్ల వచ్చాయి. శాటిలైట్ ద్వారా 7.5 కోట్లు రాగా ఆడియో రైట్స్ ద్వారా రెండు కోట్లు వచ్చాయి. ఫైనల్ గా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 5కోట్లు వచ్చాయి.
ఈ విధంగా మొత్తంగా 34 కోట్ల పెట్టుబడికి నిర్మాతలకు అన్ని వైపుల నుంచి 17.5కోట్ల లాభాలు వచ్చాయి. ఒక విధంగా ఈ బిజినెస్ లెక్కల ప్రకారం చూసుకుంటే సినిమా హిట్ అని చెప్పవచ్చు. కానీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. శివ నిర్వాణ కథను గతంలో తరహాలో ఆకట్టుకోలేకపోయాడు అని ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే మరీ దారుణంగా ఉందని నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!