టీవీ నటుడిపై మరోసారి భార్య ఫిర్యాదు!
- June 29, 2021 / 06:44 PM ISTByFilmy Focus
ప్రముఖ బుల్లితెర నటుడు కరణ్ మెహ్రా తన భార్యకు తెలియకుండా ఆమె అకౌంట్ నుండి డబ్బులు విత్ డ్రా చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతడు డ్రా చేసిన డబ్బులు వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోటి రూపాయలు. విషయం తెలుసుకున్న కరణ్ భార్య నిషా.. గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కరణ్ తో పాటు అతడికి సహకరించిన ఇద్దరు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
భర్తకు వ్యతిరేకంగా నిషా పోలీసులు సంప్రదించడం ఇది రెండోసారి. గత నెలలోనే కరణ్ తనపై దాడి చేశాడనే కారణంతో ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో పోలీసులు కరణ్ ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత అతడికి బెయిల్ లభించడంతో బయటకు వచ్చాడు. వీరిద్దరి మధ్య సఖ్యత లేదని.. మనస్పర్థలు వచ్చాయని పుకార్లు వచ్చిన సమయంలోనే నిషా తన భర్తపై కంప్లైంట్ చేసింది. అయితే కరణ్ మాత్రం ఈ విషయంలో తన భార్యను బ్లేమ్ చేస్తున్నాడు.

ఆమె చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని.. కోపం వచ్చినప్పుడు అందరిపై దాడి చేస్తుంటుందని అన్నాడు. ఇంట్లోని వస్తువులను పగలగొట్టడం ఆమెకి అలవాటని.. ఆమె కారణంగా ఓసారి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పాడు. ఈ జంటకు వివాహం జరిగి ఎనిమిదేళ్లు అవుతుంది. వీరికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!













