నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి చేసిన తొలి చిత్రం “చిలసౌ”. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన ఈ మూవీ యువతని ఆకట్టుకోనుంది. యువ దర్శకుడు శశికాంత్ టిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గూఢచారి. అడవి శేష్ కథ అందించడంతో పాటు నటించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ పతాకం పై అభిషేక్ నామా నిర్మించారు. ఈ రెండు సినిమాలు ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అయినా రెండు తప్పిదాలు చేస్తున్నాయి. అందులో ఒకటి ఏమిటంటే రెండూ ఒకే రోజు (ఆగస్టు 3 ) రిలీజ్ కావడం. ఇలా పోటీ పడడం వల్ల కలక్షన్స్ పై ప్రభావం పడుతుంది. ఇక రెండేది.. పెద్ద సినిమాలకి ఒక వారం ముందు మాత్రమే రిలీజ్ అవుతుండడం.
అంటే వారం గ్యాప్ లో నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన శ్రీనివాస్ కళ్యాణం రాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9 న థియేట్టర్లో రానుంది. ఇక కమల హాసన్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం విశ్వరూపం 2 ఆగస్టు 10 న రిలీజ్ కానుంది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం ఆగస్టు 15న థియేటర్లోకి రానుంది. సో ఈ మూడు సినిమాలు ఓపెనింగ్స్ కలక్షన్స్ బాగుండాలని బాగానే ప్లాన్ చేసుకున్నాయి. వీటి వల్ల చిలసౌ, గూఢచారి లకు థియేటర్లు తగ్గే అవకాశం ఉంది. ఇక రిలీజ్ అయిన తర్వాత ఆ మూడింటిలో ఏది బాగున్నా.. ఈ రెండు చిత్రాల వసూళ్లు తగ్గడం సహజం.