ఒకే బ్యాగ్రౌండ్‌తో రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కడం చూశాం, ఒకే పేరుతో ఎట్ ఏ టైమ్ రూపొంది ఇబ్బందులు పడ్డ, పెట్టిన సినిమాలు చూశాం. కానీ ఒకే వ్యక్తి జీవిత కథతో ఒకే సమయంలో సినిమాలు రూపొందడం చూశారా. దీనికి ఇప్పుడు టాలీవుడ్ వేదికైంది. ఈ విచిత్ర వ్యవహారానికి హీరోలు ఒకరు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అయితే, మరొకరు రవితేజ. ఇక ఆ నేపథ్యం ఏంటంటే… స్టూవర్ట్‌పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు.
స్థూలంగా విషయం అర్థమైందిగా… ఇప్పుడు డీటైల్స్‌లోకి వెళ్దాం. స్టూవర్ట్‌పురానికి చెందిన గజదంగ టైగర్ నాగేశ్వరరావు గురించి ఆ ప్రాంత వాసులకు బాగా తెలుసు. మిగిలిన ప్రాంతాలకు అంతోకొంతో తెలుసు. పేరుకే గజదొంగ అయినా… ఆ ప్రాంత వాసులకు అతనో సూపర్ హీరో. అందుకే అతని కథను సినిమాగా తీయడానికి సిద్ధమయ్యారు. చాలా నెలల క్రితం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నుండి ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. ఆ తర్వాత దీనిపై ఎలాంటి సమాచారం లేదు.
ఇంతలో ఒక నెల నుండి రవితేజ… ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా తీస్తున్నాడని వార్తలొచ్చాయి. దీపావళి సందర్భంగా ఆ సినిమా టీజర్ లుక్‌ను విడుదల చేశారు. దీంతో ‘టైగర్’ కథ అటు తిరిగి ఇటు తిరిగి రవితేజ దగ్గరకు వచ్చిందా అని అనుకున్నారు. తీరా సాయంత్రానికి సాయిశ్రీనివాస్ నుండి ‘స్టూవర్ట్‌పురం దొంగ’ అంటూ లుక్ పోస్టర్ ఇచ్చారు. అంతే కాదు టైటిల్‌లో ‘బయోపిక్ ఆఫ్ టైగర్ ’ అని రాసుకొచ్చారు. దీంతో ఏంటి…
ఒకే వ్యక్తి బయోపిక్‌గా రెండు సినిమాలా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అసలు ఇలా ఎందుకు జరిగింది. రవితేజ ‘టైగర్’ను వంశీ తెరకెక్కిస్తుంటే, సాయిశ్రీనివాస్ ‘స్టూవర్ట్‌పురం దొంగ’ను కేఎస్ రూపొందిస్తున్నారు. ఇంతవరకు మనకు తెలుసు. మరి ఒకే కథను ఇద్దరు ఎందుకు తీస్తున్నారో, వెనుక ఏం జరిగింది. ఈ సినిమాలు ముందుకెళ్తే… టాలీవుడ్‌లో ఎలాంటి పరిస్థితి వస్తుందో చూడాలి.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!