Salman Khan: ఏం జరుగుతోంది… హీరో ఫామ్‌ హౌస్‌లోకి ఇద్దరు అగంతుకులు.. అరెస్టు!

సల్మాన్‌ ఖాన్‌కు అగంతుకుల నుండి థ్రెట్‌ ఉందని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ఆయన కొంతమంది నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వం రక్షణ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇంత రక్షణ ఇస్తున్నా సల్మాన్‌ ఇంట్లోకి ఇద్దరు యువకులు ప్రవేశించడానికి ప్రయత్నిచడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ఆ ఇద్దరు అగంతుకులను అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.

ముంబయిలోని పన్వేల్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసుల వివరాల ప్రకారం… మహారాష్ట్ర రాష్ట్రంలోని పన్వేల్‌ దగ్గర్లో ఉన్న వేజ్‌లో సల్మాన్ ఖాన్‌కు అర్పితా అనే ఫాం హౌస్ ఉంది. అందులోకి జనవరి 4న ఇద్దరు యువకులు చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని గుర్తించిన సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో వారు చెప్పిన పేర్లు, చిరునామా నకిలీవని తేలింది. దీంతో అగంతుకలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరు కుర్రాళ్లు పంజాబ్‌కు చెందినవారని సమాచారం.

ఆ అగంతుకులను అజేశ్‌కుమార్‌ ఓంప్రకాశ్‌ గిల్‌, గురుసేవక్‌ సింగ్‌గా గుర్తించినట్లు సమాచారం. సినిమా హీరోలను చూడటానికి వాళ్లు ముంబయి వచ్చారు అని చెబుతున్నారట. అయితే సల్మాన్‌ ఫామ్‌ హౌస్‌ వరకు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారనేది ఇక్కడ కీలకంగా మారింది. నిజానికి సల్మాన్‌ ఖాన్‌కు వైప్లస్‌ సెక్యూరిటలీ ఉంది. లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు భద్రత కల్పించింది.

పంజాబ్‌ సింగర్‌ సిద్ధు మూసే వాలా హత్య తర్వాత సల్మాన్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. (Salman Khan) సల్మాన్‌తో మాట్లాడాలని గ్యాంగ్‌స్టర్‌లు గోల్డీ బ్రార్‌, లారెన్స్ బిష్ణోయ్‌ అనుకుంటున్నట్లు ఆ బెదిరింపు లేఖలో రాసుకొచ్చారు. అంతకుముందు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఇలానే సల్మాన్‌ను బెదిరించారు. ఇంత జరుగుతున్నా, సల్మాన్‌కు ఇంత భద్రత కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని నెటిజన్లు అంటున్నారు. మరి ఈ విషయంలో సల్మాన్‌ ఏం అంటాడో చూడాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus