Rajamouli: రాజమౌళి మానసపుత్రికలో ఆ ఇద్దరికీ ఛాన్స్‌ ఉందట!

రాజమౌళి కల ఏంటి అంటే… ‘మహా భారతం’ అని ఠక్కున చెప్పేస్తారు సినిమా ప్రేక్షకులు. అంతగా ఆ సినిమా గురించి వార్తలు ఆ మధ్య మనం చదివాం. అయితే ఆ సినిమా ఇప్పుడే కాదు, దానికి చాలా సమయం ఉంది అని చెబుతూనే ఉన్నారు రాజమౌళి. అయితే ఆ సినిమా గురించి ముచ్చట్లకు మాత్రం బ్రేక్‌ పడటం లేదు. ఏదో సందర్భంలో ఏదోలా ఆ వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వేదికగా మరోసారి ‘మహా భారతం’ విషయం చర్చకు వచ్చింది.

ఇతిహాసాల ఆధారంగా సినిమాలు తీయడం రాజమౌళికి బాగా అలవాటు. మాస్‌ సినిమా తీసినా అందులో ఇతిహాసం టచ్‌ ఉండేలా చూసుకుంటారాయన. గత సినిమాల్లో మనం ఈ విషయం చూశాం. పేరుకే రాజుల సినిమా అయినా ‘బాహుబలి’ రెండు పార్టుల్లోనూ ఇతిహాసాల టచ్‌ ఉంటుంది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో స్వాతంత్య్రోద్యమ కాలం నాటి కథ కాబట్టి అందులో నేరుగా ఆ ఫీల్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేం. కానీ రాజమౌళి మనసులో మాత్రం ‘మహా భారతం’ ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. తాజాగా అందులో రెండు ముఖ్యపాత్రల గురించి మాట్లాడారు జక్కన్న.

రాజమౌళి మహాభారతం మొదలుపెడితే అందులో నటించేది ఎవరు అనే విషయంలో చాలా రోజుల నుండి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ‘బాహుబలి’ సమయంలో అయితే ‘మహా భారతం’లో ప్రభాస్‌, రానా ఉంటారని అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కూడా ఆ జాబితాలో యాడ్‌ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిని అడిగిన ప్రశ్నకు మనకు ఆ సమాధానం వచ్చింది. అంటే ఇప్పటికి మహాభారతంలో నటించడానికి నలుగురు సిద్ధమైనట్లు. ఇంకా మిగిలిన పాత్రల కోసం ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

సినిమా మొదలయ్యే సమాయానికి ఇందులో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది స్థానంలో కొత్తవాళ్లు వస్తారు అనేది వేరే చర్చ. అయితే రాజమౌళి ఇప్పుడిప్పుడు ‘మహా భారతం’ సినిమా తీసే పరిస్థితి లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మహేష్‌బాబు సినిమా ఉంటుంది. ఆ తర్వాత హాలీవుడ్‌లో యానిమేషన్‌ సినిమా ఉంటుందని అన్నారు. ఆ తర్వాతే ‘మహా భారతం’ తీయొచ్చు. అప్పటికి ఏమవుతుందో చూద్దాం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus