Vijay Sethupathi: విజయ్ సేతుపతి కాదు సంతానం పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆ ఇద్దరేనట..!

Ad not loaded.

ఇటీవల విడుదలైన కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది. ‘మహా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి హిట్ చిత్రాల్ని తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. జూన్ 3 న విడుదలైన ఈ చిత్రం తమిళనాడులోనే, అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ రూ.360 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి.. 9 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ కు ఓ సాలిడ్ కం బ్యాక్ ను అందించింది.

నిజానికి ఇది ఆయన మార్క్ మూవీ కాదు. ఇందులో ఆయనతో రొమాన్స్, ముద్దు సీన్లు వంటివి దర్శకుడు చేయించలేదు. కంటెంట్ మీద, యాక్షన్ మీద నడిచే సినిమా ఇది. పూర్తిగా యాక్షన్ బేస్డ్ మూవీ. 67 ఏళ్ల వయసులో కూడా కమల్ హాసన్ అద్భుతంగా ఫైట్లు వంటివి చేసి అభిమానులతో ఈలలు వేయించారు. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు ఫహాద్ ఫాజిల్, సూర్య, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు కూడా నటించారు.

ఈ ముగ్గురిలో విజయ్ సేతుపతికి మంచి ఇంట్రొడక్షన్ సీన్ దొరికింది. విలన్ సంతానం పాత్రలో అతను భయపెడుతూనే నవ్వించాడు.దర్శకుడు లోకేష్ కనగరాజ్.. ‘మాస్టర్’ తర్వాత విజయ్ సేతుపతి కి మరో మంచి పాత్రని ఇచ్చాడు. ఆ పాత్రకి విజయ్ సేతుపతి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. అయితే ఈ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ విజయ్ సేతుపతి కాదట.

ముందుగా ఈ పాత్రకి స్టార్ కొరియోగ్రాఫర్స్ మరియు స్టార్ డైరెక్టర్స్ అయిన ప్రభుదేవా, రాఘవ లారెన్స్ ను సంప్రదించాడట లోకేష్. వాళ్ళు నొ చెప్పడంతో విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నాడట.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus