Chiranjeevi: బ్లాక్‌ బస్టర్‌ హిట్లిచ్చిన దర్శకుడి కోసం చిరు ఓకే అంటారా?

వరుసగా సినిమాలు ఓకే చేస్తూ.. కుర్ర స్టార్‌ హీరోలను మించిపోయిన చిరంజీవి.. ఇప్పుడు కాస్త స్లో అయ్యారు. అయితే ఇది స్లో కాదని, హిట్‌ వచ్చిన మూడ్‌లో కాస్త జాగ్రత్త పడుతున్నారని చెబుతున్నారు. అలా చిరంజీవి ఇప్పుడు డెసిషన్‌ మేకింగ్‌లో తీసుకున్న గ్యాప్‌కి ఎండ్‌ కార్డు పడిందని చెబుతున్నారు. చిరంజీవి మళ్లీ వరుస ఓకేలు చెప్పే టైమ్‌ దగ్గరకొచ్చిందని సమాచారం. అవును ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చిరంజీవి ఓకే చేస్తున్నారని టాక్‌. అందులో ఒక సినిమా తనకు రెండు బ్లాక్‌ బస్టర్‌లు ఇచ్చిన డైరక్టర్‌కు అంటున్నారు.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చిరంజీవి ఇటీవల భారీ హిట్‌ అందుకున్నారు. ఈ హిట్‌ మామూలుగా రాలేదు. ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్‌ తర్వాత వచ్చింది. దీంతో నెక్స్ట్‌ స్టెప్‌ జాగ్రత్తగా వేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే నెక్స్ట్‌ మూవీ కూడా భారీగా ఉండాలని ఫిక్స్‌ అయ్యారట. అందులో భాగంగా వీవీ వినాయక్‌ డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. దాని కోసం వినాయక్‌ ముందు రెండు కథలు పెట్టారని చెబుతున్నారు. అందులో ఏది ఓకే చేసుకొని సినిమాను పట్టాలెక్కిస్తారో చూడాలి.

‘గాడ్‌ఫాదర్‌’ సినిమా ఫలితం విషయంలో హ్యాపీగా ఉన్నామని టీమ్‌ చెబుతున్నా.. వసూళ్లు మాత్రం సరిగ్గా లేవని చెబుతున్నారు. దీంతో మళ్లీ రీమేక్‌ అంటే చిరంజీవి భయపడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ‘బ్రో డాడీ’, ‘భీష్మ పర్వం’ రీమేక్‌లు ఇప్పుడు బయటకు తీశారని చెబుతున్నారు. ఈ రెండు సినిమాల రీమేక్‌ రైట్స్‌ రామ్‌చరణ్‌, చిరంజీవి సన్నిహితులు కొనుగోలు చేశారని సమాచారం. వాటిలో ఒక కథను వినాయక్‌ ఎంచుకుని, కథను పూర్తి స్థాయిలో తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి తెరకెక్కిస్తారట.

మరోవైపు ‘విశ్వాసం’ సినిమా రీమేక్‌ కూడా చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇది అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో చిరంజీవి కోసం వినయ్‌ ఏ కథను ఎంచుకుంటారో చూడాలి. మరోవైపు చిరు కోసం వినయ్‌ వేరే కథ సిద్ధం చేయిస్తారా అనేది చూడాలి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus