2024 సంవత్సరంలో జరగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. మన దేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీ జాబితాలో పోటీ పడే సినిమాల జాబితాకు సంబంధించి వడపోత కార్యక్రమం మొదలు కాగా తెలుగు నుంచి రెండు సినిమాలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. అధికారిక ఎంట్రీకి మొత్తం 22 సినిమాలు వచ్చినట్టు సమాచారం అందుతోంది. తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన బలగం, దసరా సినిమాలు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాలు ఆస్కార్ సాధించడానికి అర్హత ఉన్న సినిమాలు కాగా ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు అయినా అవార్డ్ వస్తుందో చూడాల్సి ఉంది. ది స్టోరీ టెల్లర్ (హిందీ), మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), 12th ఫెయిల్ (హిందీ), విడుదలై పార్ట్1(తమిళ్), ది కేరళ స్టోరీ, జ్విగాటో, రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ, బాప్ లాయక్, గదర్, వాల్వి, మరికొన్ని సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రముఖ ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా ఈ సినిమాలను వీక్షిస్తోందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలను చూసిన తర్వాత ఒక సినిమాను ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ కు పంపనున్నారు. సినీ విశ్లేషకులు జ్విగాటో, బలగం సినిమాలు ఆస్కార్ కు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతుండటం గమనార్హం.
ఈ సినిమాలలో కొన్ని సినిమాలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శితమయ్యాయి. బలగం సినిమా అధికారికంగా ఆస్కార్ ఎంట్రీకి వెళ్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బలగం సినిమా చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని భారతీయ సినిమాలు అవార్డులను గెలుచుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!