టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ (Uday Kiran) ఒకరు. ఉదయ్ కిరణ్ కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఉదయ్ కిరణ్ మరణం గురించి తాజాగా మరోసారి ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ బాల్యం నుంచి చిరంజీవికి (Chiranjeevi) వీరాభిమాని అని ఆమె అన్నారు. ఒక సినిమా ఈవెంట్ లో చిరంజీవిని కలిసి షేక్ హ్యాండ్ ఇస్తే ఉదయ్ చాలా ఎగ్జైట్ అయ్యాడని శ్రీదేవి వెల్లడించారు.
ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి నుంచి చాలా సపోర్ట్ లభించిందని చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ కు గాడ్ ఫాదర్ లా ఉండేవారని శ్రీదేవి పేర్కొన్నారు. ఉదయ్ కిరణ్ తన సినిమాల గురించి కూడా చిరంజీవితో చర్చించేవారని ఆమె చెప్పుకొచ్చారు. ఉదయ్ కిరణ్ ఇప్పుడు మన మధ్య లేడని జరిగిందేదో జరిగిందని దానికి నేనెవరినీ తప్పుపట్టనని శ్రీదేవి వెల్లడించడం గమనార్హం.
ఉదయ్ విషయంలో చిరంజీవి తప్పు ఏ మాత్రం లేదనే విధంగా శ్రీదేవి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. శ్రీదేవి చేసిన కామెంట్లను మెగా ఫ్యాన్స్ సైతం తెగ వైరల్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను (Nuvvu Nenu) సినిమా కొన్నిరోజుల క్రితం రీరిలీజ్ కాగా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఉదయ్ కిరణ్ మరిన్ని సినిమాలు రీరిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
ఉదయ్ కిరణ్ జీవించి ఉంటే మాత్రం ఇప్పటికీ ఏదో ఒక విధంగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉండే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఉదయ్ కిరణ్ అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ ను అందుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు కావడం గమనార్హం.