Uday Kiran: చిత్రం సినిమా ఫస్ట్ ఛాయిస్ ఉదయ్ కిరణ్ కాదంట..!

  • August 9, 2023 / 05:15 PM IST

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అవ్వాలంటే కేవలం టాలెంట్ ఉంటే మాత్రం సరిపోదు, కష్టపడే తత్త్వం మరియు అదృష్టం కూడా ఉండాలి. ఈ రెండు కలిసి వస్తే జాతకాలు మారిపోతాయి. అలా అన్నీ కుదిరిన హీరోలు చాలా మంది ఉన్నారు, వారిలో ఒకరు ఉదయ్ కిరణ్. తేజ దర్శకత్వం లో వచ్చిన ‘చిత్రం’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఉదయ్ కిరణ్, ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో వరుసగా నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సంచలనాత్మక చిత్రాల్లో హీరో గా నటించాడు.

ఆ రోజుల్లోనే ఈయన చిరంజీవి , బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సరిసమానమైన మార్కెట్ ని సంపాదించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేసాడు. అలా కెరీర్ ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సమయం లో సరైన నిర్ణయాలు తీసుకోక డిజాస్టర్ ఫ్లాప్ చిత్రాలను అందుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి మార్కెట్ పూర్తిగా పోవడం, హీరో అవకాశాలు తగ్గిపోవడం, కెరీర్ లేక తీవ్రమైన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే.

అయితే ఉదయ్ కిరణ్ (Uday Kiran) కెరీర్ లో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా, ‘మనసంతా నువ్వే’ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఆ రోజుల్లో ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఉదయ్ కిరణ్ కి యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఈ సినిమా ని తొలుత సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యాలనే ప్లాన్ లో ఉండేవాడట నిర్మాత ఏం ఎస్ రాజు.

అప్పుడు మహేష్ బాబు వేరే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం తో, ఈ కథ నాకంటే ఉదయకిరణ్ కి ఇంకా బాగా సూట్ అవుతుంది, అత్తనితో చెయ్యండి అని సలహా ఇచ్చాడట. అలా ఉదయ్ కిరణ్ యూత్ ఆడియన్స్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి పెట్టిన మనసంతా నువ్వే చిత్రం చెయ్యడానికి మహేష్ బాబు కారణం అవ్వడం విశేషం.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus