ఉదయ భాను పరిచయం అవసరం లేని పేరు. యాంకర్స్ లో ఫస్ట్ స్టార్ అంటే ఈమె పేరే చెబుతారు. ఒకప్పటి యూత్ ను, మాస్ ఆడియన్స్ ను తన మార్క్ యాంకరింగ్ తో విశేషంగా ఆకట్టుకున్న ఈమె తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించారు. స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించారు. అయితే ఆమె పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి షాక్ ఇచ్చింది.
ఉదయభాను మాట్లాడుతూ.. “శేఖర్ కమ్ముల గారు ‘లీడర్’ లో స్పెషల్ సాంగ్ చేయించిన తర్వాత త్రివిక్రమ్ గారు ‘జులాయి’ లో టైటిల్ సాంగ్ కి తీసుకున్నారు. తర్వాత ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం కూడా నన్ను అడిగారు. అంత పెద్ద స్టార్ సినిమాలో సాంగ్ కోసం అడిగినప్పుడు నాకు ఆనందంగా అనిపించింది. కానీ పార్టీ సాంగ్ అంటున్నారు.. నాతో పాటు ఇంకొంతమంది హీరోయిన్స్ ఉంటారు అన్నప్పుడు ..మనం అంత హైలెట్ అవ్వమేమో అనిపించింది.
దీంతో ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాను. ‘అత్తారింటికి దారేది’ మాత్రమే కాదు నేను స్టార్ యాంకర్‌గా ఫామ్‌లో ఉన్నప్పుడు చాలా హిట్ సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అవి నేను రిజెక్ట్ చేసుకున్న చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.ఇక యాంకరింగ్ పరంగా చూసుకుంటే కొంతమంది కావాలనే నన్ను పెట్టారు. కొందరు యాంకర్లు ఒక సిండికేట్ గా ఫామ్ నా లాంటి వాళ్లకి ఛాన్సులు లేకుండా చేస్తున్నారు. కొన్ని ఈవెంట్లకి నన్ను సంప్రదించిన తర్వాత నేను రెడీ అయ్యి కూర్చుంటే చివరి నిమిషంలో నన్ను తప్పించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి” అంటూ తన చేదు జ్ఞాపకాలు చెప్పుకొచ్చింది.