మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా `ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య` టీజ‌ర్ విడుద‌ల‌

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు అందిస్తోన్న మ‌రో కంటెంట్ బేస్డ్ మూవీ `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌`.ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 17న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శుక్ర‌వారం చిత్ర బృందం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. వి.కె.న‌రేశ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మ‌ని టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. స‌త్య‌దేవ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని లుక్‌తో క‌న‌ప‌డుతున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న ఫొటోగ్రాఫ‌ర్‌గా క‌న‌ప‌డుతున్నారు. టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది… ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ – “డైరెక్ట‌ర్ వెంక‌ట్ మ‌హా మ‌న నెటివిటీకి త‌గిన‌ట్టు మంచి ఎమోష‌న్స్‌తో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌` సినిమాను అద్భుతంగా మ‌లిచారు. అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17, 2020 విడుల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus