Akhil: ఉమైర్ సంధు షాకింగ్ ట్వీట్.. అక్కినేని ఫ్యాన్స్ కు కోపం వచ్చేలా?

ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ లు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్ గురించి ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలాను అఖిల్ వేధించాడని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు. ఏజెంట్ ఐటం సాంగ్ షూట్ సమయంలో ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు.

ఊర్వశి రౌతెలా దృష్టిలో అఖిల్ అక్కినేని ఏ మాత్రం మెచ్యూరిటీ లేని నటుడు అని ఆమె అఖిల్ తో పని చేయడాన్ని అన్ కంఫర్టబుల్ గా ఫీలైందని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు. ఉమైర్ సంధు ట్వీట్ల విషయంలో సెలబ్రిటీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమైర్ సంధు తన బిహేవియర్ ను మార్చుకుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అఖిల్ ఏజెంట్ మూవీ ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమా దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం. అఖిల్ కెరీర్ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం. త్వరలో అఖిల్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

అక్కినేని అఖిల్ (Akhil) కు భవిష్యత్తు సినిమాలతో సైతం భారీ విజయాలు దక్కాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నాయి. అక్కినేని హీరోల సినిమాలు ఇప్పటివరకు 60 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. రాబోయే రోజుల్లో ఈ రికార్డ్ సులువుగానే బ్రేక్ అవుతుందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా అఖిల్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. అఖిల్ పారితోషికం కూడా తక్కువగానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus