Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Focus » Athidhi: 15 ఏళ్ళ ‘అతిథి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..!

Athidhi: 15 ఏళ్ళ ‘అతిథి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..!

  • October 19, 2022 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Athidhi: 15 ఏళ్ళ ‘అతిథి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..!

‘అర్జున్’ అంచనాలను అందుకోలేకపోయినా మహేష్ బాబు కెరీర్లో అది ప్లాప్ సినిమా అనలేము. కమర్షియల్ గా ఆ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. మహేష్ బాబు తన అన్నయ్య, దివంగత నటుడు రమేష్ బాబు సొంత బ్యానర్ అయిన ‘కృష్ణా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్'(KPPL) బ్యానర్ పై చేసిన మొదటి మూవీ ఇది. ఆయనకు ఈ మూవీ భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో వచ్చిన లాభాలతో మహేష్ తో మరో సినిమా నిర్మించాడు రమేష్ బాబు. అదే అతిథి. ‘అతడు’ ‘పోకిరి’ వంటి సూపర్ హిట్లతో ఫామ్లో ఉన్న మహేష్ బాబుకి ‘సైనికుడు’ ఫలితం పెద్ద షాకిచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు సురేందర్ రెడ్డితో ‘అతిథి’ అనే చిత్రాన్ని చేశాడు మహేష్ బాబు. ఈ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలుసు. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ‘అతిథి’ చిత్రం 2007వ సంవత్సరం అక్టోబర్ 18న రిలీజ్ అయ్యింది. ‘సైనికుడు’ రిజల్ట్ ను ఈ మూవీ మరిపిస్తుంది, పైగా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది అని అభిమానులు ఈ సినిమాల పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

2) నిజానికి ఈ చిత్రం కథను మొదట ఎన్టీఆర్ కు వినిపించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఎన్టీఆర్ కు ‘అశోక్’ ‘అతిథి’ కథలను వినిపిస్తే ఎన్టీఆర్ ‘అశోక్’ ను సెలెక్ట్ చేసుకున్నాడు. మహేష్ కు ఈ కథ బాగుంటుంది అని సురేందర్ రెడ్డికి సూచించింది కూడా ఎన్టీఆరే..!

3) అదే టైంలో లైన్ విని మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే సురేందర్ రెడ్డి మళ్ళీ ఈ కథ విషయంలో సంతృప్తి చెందక వక్కంతం వంశీతో మార్పులు చేయించాడట. మహేష్ ఆ టైంలో ఒకసారి సినిమా చేస్తాను అని కమిట్ అయితే డైరెక్టర్ ను ప్రశ్నించేవాడు కాదు.

4) ఇక ‘సైనికుడు’ దగ్గరనుండి మహేష్ తో సినిమా చేయడానికి ‘యూటీవీ మోషన్ పిక్చర్స్’ వారు ఇంట్రెస్ట్ చూపించడంతో వారిని కూడా ‘అతిథి’ నిర్మాణంలో భాగస్వాముల్ని చేశారు మహేష్- నమ్రతలు.

5) ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ‘లక్ష్మీ’ సినిమా భామలైన నయనతార, ఛార్మి లను అనుకున్నారు. కానీ డేట్స్ క్లాష్ వల్ల వాళ్ళు తప్పుకోవడంతో బాలీవుడ్ భామ అమృత రావు ని పట్టుకొచ్చారు. ఆరోజుల్లోనే ఆమెకు భారీగా రూ.60 లక్షలు పారితోషికం ఇచ్చారు.

6) పూజా కార్యక్రమాల తర్వాత కొత్త లుక్ కోసం మహేష్ బాబు 4 నెలలు టైం తీసుకోవడంతో షూటింగ్ కాస్త లేట్ గా స్టార్ట్ అయ్యింది.

7) ఈ చిత్రంలో నాజర్ పాత్రకు మొదట ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. కొంత పార్ట్ షూటింగ్ ను కూడా నిర్వహించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో చివర్లో నాజర్ ని పెట్టి రెండు రోజుల్లో ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తిచేశారు.

8) సెట్స్ పైకి వెళ్ళాక.. దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వంశీ లు కథలో చాలా మార్పులు చేశారట. క్లైమాక్స్ లో చిన్న పాపని చంపే సీన్ మొదటి వెర్షన్ ప్రకారం లేదట. కానీ తర్వాత ఆ పాపని చంపేసినట్టు చూపించారు. అది సినిమాకి చాలా మైనస్ అయ్యింది.

9) సినిమాకి మొదట అనుకున్న బడ్జెట్ రూ.25 కోట్లు అయితే ఫైనల్ గా రూ.30 కోట్లు అయ్యిందట.

10) దసరా టైంలో సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది మూవీ. మహేష్ బాబు కాబట్టి.. మొదటి వారం ఓపెనింగ్స్ వరకు ఒకే అనిపించింది. కానీ పోటీగా ‘చిరుత’ ‘హ్యాపీ డేస్’ ‘తులసి’ వంటి సినిమాలు ఉండటంతో ‘అతిథి’ నిలబడలేకపోయింది.

11) మహేష్ క్రేజ్ వల్ల నిర్మాత సేఫ్ అయ్యాడు.. కొన్ని ఏరియాల్లో బయ్యర్స్ నష్టపోయారు. 20 శాతం వరకు నిర్మాత సర్దుబాటు చేయడం జరిగింది. అయితే ఓవర్సీస్ లో ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. అక్కడి బయ్యర్స్ సేఫ్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ‘కృష్ణా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్'(KPPL) బ్యానర్ పై కృష్ణ కానీ రమేష్ బాబు కానీ మరో సినిమా నిర్మించలేదు. ‘దూకుడు’ ‘ఆగడు’ చిత్రాలకు మాత్రం సమర్పకులుగా వ్యవహరించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amrita Rao
  • #Athidhi Movie
  • #Mahesh Babu
  • #Surender Reddy

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

6 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

8 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

9 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

4 hours ago
Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

4 hours ago
Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

5 hours ago
Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

5 hours ago
Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version