నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ నట ప్రస్థానంలో ఎన్నో మరపురాని చిత్రాలున్నాయి.. కలర్, డీటీఎస్, సినిమా స్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతిక పరిజ్ఞాణంతో తెలుగు సినిమాకి కొత్త సొగసులు అద్దారు కృష్ణ.. 1965లో ‘తేనెె మనసులు’ తో బ్రేక్ వచ్చిన తర్వాత.. ఆయన హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెరకెక్కిన ఫస్ట్ కలర్, సస్పెన్స్ థ్రిల్లర్.. ‘అవే కళ్లు’.. కాంచన, గీతాంజలి, పద్మనాభం, గుమ్మడి, రాజనాల, నాగభూషణం తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించగా..
ఎ.సి. త్రిలోక్ చందర్ దర్శకత్వంలో ఎవిఎమ్ సంస్థ నిర్మించింది.. 1967 డిసెంబర్ 14న విడుదలైన ఈ సినిమా 2022 డిసెంబర్ 14 నాటికి 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.. 1966లో ‘గూఢాచారి 116’ లో సీక్రెంట్ ఏజెంటుగా నటించి మెప్పించిన కృష్ణకు తర్వాత సంవత్సరమే ‘అవే కళ్లు’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటించే అవకాశం రావడం విశేషం.. కథగా చెప్తే థ్రిల్ అనిపించదు కానీ ఇప్పటి ప్రేక్షకులను సైతం ‘అవే కళ్లు’ సినిమా ఆకట్టుకుంటుంది..
జంట హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్న నల్ల ముసుగు వ్యక్తిని.. కేవలం కళ్లు ఆధారంగా కనిపెట్టడమే కథ అని ముందుగానే హింట్ ఇచ్చినా.. ఆద్యంతం స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేసి ప్రేక్షకులను కట్టిపడేశారు దర్శకులు త్రిలోక్ చందర్.. లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో పాటు ఉత్కంఠతకు గురిచేసే అంశాలతో రూపొందిన ఈ చిత్రం అశేష ప్రేక్షకాదరణను పొందింది.. తొలి తెలుగు కలర్, సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో తమిళనాట కూడా కలర్‌లోనే రవి చంద్రన్, కాంచన జంటగా తీశారు.. గీతాంజలి అదే పాత్రను తమిళంలోనూ చేసింది..
ఈ మిస్టరీ థ్రిల్లర్ పిక్చర్ కోలీవుడ్‌లో ‘అదే కంగల్’ 1967 మే 26న రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన ఏడు నెలలకు తెలుగులో విడుదలై ఘన విజయం సాధించింది.. డి.వి.నరసరాజు మాటలు, దాశరథి, కొసరాజు పాటలు రాశారు. వేద అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది.. పాటలన్నీ ప్రేక్షకాదరణపొందాయి.. ముఖ్యంగా ‘మా వూళ్లో ఒక పడుచుంది.. దెయ్యమంటే భయమన్నది’ అయితే ఎవర్ గ్రీన్ సాంగ్.. ‘డుం డుం గంగిరెద్దు’ పాట కూడా.. తెలుగులో తెరకెక్కిన తొలి కలర్ థ్రిల్లర్ చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘అవే కళ్లు’..