‘ఉప్పెన’.. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కన్నడ చిన్నది కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు సానా వంటి టాలెంటెడ్ నటీనటులు.. దర్శకుడిని టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చేసిన బ్లాక్ బస్టర్ ఫిలిం.. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ప్రేక్షకులకి ఊహించని ట్విస్ట్‌తో కూడిన షాక్ ఇచ్చాడు బుచ్చిబాబు. పాండమిక్ తర్వాత చిన్న సినిమాగా వచ్చి.. రూ. 100 కోట్ల కలెక్షన్లతో ‘ఉప్పెన’ సృష్టించింది. అయితే 1992లోనే ఇలాంటి నేపథ్యంతో ‘చామంతి’ అనే సినిమా వచ్చిందంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.. అసలు ‘ఉప్పెన’ కీ ఈ సినిమాకీ లింక్ ఏంటి?.. ఇప్పుడు చూద్దాం..
రోజా కోలీవుడ్ ఎంట్రీ..
ఆర్.కె. సెల్వమణి.. ‘తొలిముద్దు’, ‘జీన్స్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ప్రశాంత్ హీరోగా.. రోజాను కోలీవుడ్‌కి కథానాయికగా పరిచయం చేస్తూ తమిళ్‌లో ‘చెంబురుతి’ (Chembaruthi) సినిమా డైరెక్ట్ చేశారు. అంతకుముందు తెలుగులో రాజేంద్ర ప్రసాద్ ‘ప్రేమ తపస్సు’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ ‘చెంబురుతి’ చిత్రాన్ని ‘చామంతి’ పేరుతో తెలుగులో డబ్ చేశారు.
క్లుప్తంగా ఇదీ కథ..
సీనియర్ నటి భానుమతి రామకృష్ణ, నాజర్, వాసవి, కైకాల సత్యనారాయణ (అతిథి పాత్ర) తదితరులు నటించారు. మేస్ట్రో ఇళయ రాజా సంగీతమందించారు. చామంతి (రోజా) అన్నయ్య పాండి (రాధా రవి) భానుమతి రామకృష్ణ ఇంట్లో పనికి చేర్పిస్తాడు.. చేపలు పట్టడం అతని వృత్తి.. భానుమతి మనవడు రాజా (ప్రశాంత్) తన చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని తెలిసి.. రాజా ఇంటికి వచ్చి ఫ్యామిలీ మొత్తానికి వార్నింగ్ ఇస్తాడు.. రాజా మామ (నాజర్ క్యారెక్టర్) తన కూతురు మాలతి (వాసవి) ని రాజాకిచ్చి చేయాలనుకుని.. రాజా, చామంతిల ప్రేమకు అడ్డుపడుతుంటాడు.. ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని రాజా, చామంతి ఎలా కలిశారనేది కథ..
అందులో హీరో.. ఇందులో హీరోయిన్..
‘ఉప్పెన’ లాంటి ట్విస్ట్ అయితే ఉండదు కానీ.. బీచ్ నేపథ్యం.. జాలర్ల వాతావరణం చూస్తుంటే అలా అనిపిస్తుంటుంది.. ఇందులో హీరోయిన్ మత్స్యకారుల కుటుంబానికి చెందిన నిరుపేద అయితే.. ‘ఉప్పెన’ లో హీరోది జాలర్ల నేపథ్యం.. హీరోయిన్ రిచ్.. రెండిట్లోనూ కథానాయిక అన్నయ్యే ప్రేమకి అడ్డుపడతాడు.. తెలుగులోనూ బాగా ఆడిందీ చిత్రం.. ఇళయరాజా స్వరపరిచినవి మొత్తం 8 (ఒక బిట్ సాంగ్) పాటలుంటాయి.. వేటూరి, రాజశ్రీ, వెలిదెండ్ల శ్రీరామ మూర్తి లిరిక్స్ రాశారు. ఎస్.పి. బాలు, చిత్ర, శ్రీనివాస్‌లు పాడారు. భానుమతి రామకృష్ణ ‘చామంతిపువ్వు’ పాటలో గొంతు కలిపారు.
రోజా – సెల్వమణిల లవ్ స్టోరీ..
ఈ చామంతి పరిచయమే రోజా – సెల్వమణిల ప్రేమకు బీజం వేసిందని అంటుంటారు. తర్వాత ఆయన దర్శకత్వంలో నిర్మాతగా మారి ‘సమరం’ అనే కళాఖండం తీసింది.. సినిమా డిజాస్టర్ కావడంతో ఆర్థికంగా చాలా నష్టపోయింది.. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపి.. 2002లో సెల్వమణిని పెళ్లి చేసుకుంది.. వీరికి ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే.. ఇదీ ‘ఉప్పెన’ కీ ‘చామంతి’ చిత్రానికీ ఉన్న పోలిక..