రీమేక్ సినిమాలు చేస్తున్నప్పుడు మేకర్స్ చాలా జాగ్రత్తలు వహించాలి. వేరే భాషలో హిట్ అయ్యింది కదా అని.. దాన్ని తమ భాషల్లోకి రీమేక్ చేసినంత మాత్రాన హిట్ వచ్చేయదు. అసలు ఒక భాషలో ఆ సినిమా ఎందుకు హిట్ అయ్యింది. అక్కడి ప్రేక్షకులు దేనికి ఎక్సయిట్ అయ్యారు? ఈ విషయాలు ఒకటికి రెండుసార్లు అంచనా వేసుకుని తర్వాత దాన్ని రీమేక్ చేయాలి. ఇలా చేయకపోతే.. ఫలితం ఎలా ఉంటుందో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి.
అందులో ఒకటి ‘జాను’ (Jaanu) సినిమా అని చెప్పాలి. శర్వానంద్ (Sharwanand) హీరోగా సమంత (Samantha) హీరోయిన్ గా సి ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ కి ఇది రీమేక్. అక్కడ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), త్రిష (Trisha) .. ప్రధాన పాత్రలు పోషించారు. ఒకరోజులో జరిగే కథ ఇది. పాత ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ అవ్వడం. చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయిని మరోసారి చూడటానికి హీరో అక్కడికి వెళ్లడం.
ఆ తర్వాత ప్రియురాలితో కలిసి.. తమ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ సిటీ అంతా తిరగడం. చివరికి హీరోయిన్ ను ఫ్లైట్ ఎక్కించడం. చెప్పుకోవడానికి సింపుల్ గానే ఉన్నప్పటికీ..! ఇందులో మంచి ఫీల్ ఉంటుంది. ఒరిజినల్లో దర్శకుడు ఆ ఫీల్ ను బాగా క్యారీ చేశాడు. విజయ్ సేతుపతి లవర్ బాయ్ గా కనిపించడం అనేది కూడా కొంచెం కొత్తగా అనిపించింది. కానీ తెలుగులో శర్వానంద్ ను అలాంటి సినిమాల్లో ఆడియన్స్ చూశారు.
సో ‘జాను’ లో అది కొత్తగా అనిపించలేదు. పైగా ’96’ ని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేయాలి అని డిసైడ్ అయిన వెంటనే అల్లు అర్జున్,నాని వంటి హీరోలకి చెప్పారు.కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. గోపీచంద్ అయితే సెట్ అవుతాడు అని అతనికి కూడా కథ చెప్పించారు. అతను కూడా నో చెప్పాడు. ఫైనల్ గా శర్వానంద్ కి టైలర్ మేడ్ లాంటి సినిమా కాబట్టి అతను ఓకే చేసేశాడు. కానీ అతని స్ట్రాటజీ ఫెయిల్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తి కావస్తోంది.