మహేష్ బాబు (Mahesh Babu) , త్రివిక్రమ్ (Trivikram) ..ల కలయికలో ‘అతడు’ (Athadu) తర్వాత వచ్చిన చిత్రం ‘ఖలేజా’ (Khaleja) . చాలా మందికి ఈ సినిమా హాట్ ఫేవరెట్. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ‘ఖలేజా’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) ‘అతడు’ వంటి క్లాసిక్ మూవీ తర్వాత.. త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్లో ‘హరే రామ హరే కృష్ణ’ అనే సినిమాని అనౌన్స్ చేశారు ‘ఒక్కడు’ (Okkadu) నిర్మాత యం.యస్.రాజు (M. S. Raju) . కొన్నాళ్ళు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. ‘అతడు’ కి దేవి శ్రీ ప్రసాద్ ను (Devi Sri Prasad) సంగీత దర్శకుడిగా అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ ఆ టైంలో అతను బిజీగా ఉండటంతో తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ‘హరే రామ హరే కృష్ణ’ కి దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా ఫస్ట్ ఫిక్స్ చేశారు. యం.యస్.రాజు నిర్మించిన ‘వర్షం’ (Varsham) ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana) వంటి సినిమాలకి కూడా దేవి శ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి.. ఈ ప్రాజెక్టుకి ముందుగా ఎంపికైన క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్ ఇతనే.!
2) అయితే స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే పేపర్ పైనే.. ఆ టైంలో రూ.80 కోట్ల బడ్జెట్ అయిపోతుందని త్రివిక్రమ్, యం.యస్.రాజు గ్రహించారు. అందువల్ల తాత్కాలికంగా ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టాలి అనుకున్నారు.తర్వాత యం.యస్.రాజు సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో ఆయన ‘హరే రామ హరే కృష్ణ’ ప్రాజెక్టుని పూర్తిగా పక్కన పెట్టేశారు.
3) అయితే తర్వాత ‘పోకిరి’ (Pokiri) ఇండస్ట్రీ హిట్ అవ్వడం. మహేష్ బాబు మార్కెట్ రూ.70 కోట్లకి పెరగడం జరిగింది. అయినప్పటికీ ‘హరే రామ హరే కృష్ణ’ కాకుండా.. ఓ మిడ్ రేంజ్ సినిమా చేద్దామని త్రివిక్రమ్, మహేష్ భావించారు.
4) ఈ క్రమంలో రవితేజతో (Ravi Teja) ‘వీడే’ (Veede) వంటి చిత్రాన్ని నిర్మించిన సింగనమల రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చి మహేష్ – త్రివిక్రమ్..లకి అడ్వాన్స్..లు ఇచ్చేసి లాక్ చేశారు. ఆ తర్వాత సి.కళ్యాణ్ కూడా వచ్చి చేరారు. ‘ఖలేజా’ (Khaleja) ప్రయాణం అక్కడి నుండి మొదలైంది.
5) అయితే దేవి శ్రీ ప్రసాద్ బిజీ అవ్వడంతో అతను తప్పుకోవడం.. అతని ప్లేస్లో మణిశర్మ (Mani Sharma) వచ్చి చేరడం జరిగింది.
6) హీరోయిన్ గా మొదట పార్వతీ మెల్టన్ ను (Parvati Melton) తీసుకున్నారు. కొంత భాగం ఆమెతో షూటింగ్ కూడా జరిపారు. తర్వాత ఆమె తప్పుకోవడం.. అనుష్క (Anushka Shetty ) హీరోయిన్ గా వచ్చి చేరడం జరిగింది.
7) రాజస్థాన్ వంటి ఏరియాలో 60 శాతం షూటింగ్ చేశారు. ఇసుక ప్రాంతం కాబట్టి.. టీంకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట. మొదట ఈ సినిమాకి ‘దైవం మనుష్య రూపేణ’ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. కానీ మహేష్ కి ఉన్న స్టార్ ఇమేజ్ దృష్ట్యా తర్వాత దాన్ని ‘ఖిలాడీ’ గా మార్చారు. కొన్నాళ్ల తర్వాత అది ‘ఖలేజా’ అయ్యింది.
8) ఈ సినిమా టైటిల్ గురించి కూడా అప్పట్లో పెద్ద గొడవ అయ్యింది. ఆల్రెడీ ఆ టైటిల్ వేరే చిన్న సినిమాకి రిజిస్టర్ చేసుకోవడంతో ‘మహేష్ ఖలేజా’ (Khaleja) టైటిల్ మార్చాల్సి వచ్చింది.
9) ఫైనల్ గా 2010 అక్టోబర్ 7న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. 3 ఏళ్ళ తర్వాత తమ అభిమాన హీరోని బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో థియేటర్లకు పరుగులు తీశారు. కానీ మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘ఖలేజా’ (Khaleja) అనే టైటిల్ కి ఈ కథకి ఏమైనా సంబంధం ఉందా? మధ్యలో ‘దేవుడు’ కాన్సెప్ట్ ఏంటి అంటూ ఓ రేంజ్లో మహేష్ అభిమానులే త్రివిక్రమ్ పై ఫైర్ అవ్వడం జరిగింది.
10) దీంతో త్రివిక్రమ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి ‘ఖలేజా’ కథ గురించి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. దానికి సంబంధించిన వీడియో యూట్యూబ్లో ఉంది. చాలా బాగుంటుంది. ఫైనల్ గా ‘ఖలేజా’ (Khaleja) రిజల్ట్ ను త్రివిక్రమ్ యాక్సెప్ట్ చేశారు. ‘అభిమానులు ఏదో ఆశించి వస్తే.. నేను ఇంకేదో వారికి చూపించాను. దాంతో వాళ్ళు డిజప్పాయింట్ అయ్యారు’ అని త్రివిక్రమ్ తన తప్పుని ఒప్పుకున్నారు.
11) రిజల్ట్ సంగతి పక్కన పెట్టేస్తే.. మహేష్ – త్రివిక్రమ్..ల కెరీర్లో ‘ఖలేజా’ బెస్ట్ వర్క్ అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ మనస్ఫూర్తిగా తీసిన సినిమాలో మహేష్ మనస్ఫూర్తిగా నటిస్తే ఎలా ఉంటుందో ‘ఖలేజా’ తెలియజేసింది. టీవీల్లో ఈ సినిమాని చూశాక చాలా మంది ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
12) ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మహేష్ బాబు పెర్ఫార్మన్స్ ‘ది బెస్ట్’ అనే విధంగా ఉంటుంది. ‘సదా శివ సన్యాసి’ అనే పాట అప్పట్లో మార్మోగింది. ఇంటర్వెల్ ఫైట్ కూడా రిపీట్స్ లో చేసే విధంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.