ఇప్పుడంటే మల్టీస్టారర్ అంటే.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి యాక్ట్ చేస్తున్నారు.. సూపర్ అనుకుంటున్నారు కానీ.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుండే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు స్టార్లు జతకట్టారు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి అగ్ర కథానాయకులు కలిసి చిత్రాలు చేశారు.. వారిలో ‘నటశేఖర’, ‘సూపర్ స్టార్’ కృష్ణ, నటభూషణ శోభన్ బాబులది క్రేజీ కాంబినేషన్.. వీరి కలయికలో అరడజను సినిమాలొచ్చాయి.. అన్నీ కూడా ఘనవిజయం సాధించడం విశేషం..
‘లక్ష్మి నివాసం’, ‘మంచి మిత్రులు’, ‘గంగ మంగ’ వంటి హ్యాట్రిక్ చిత్రాల తర్వాత కృష్ణ, శోభన్ బాబు చేసిన మూవీ.. ‘ముందడుగు’.. 1983 ఫిబ్రవరి 25న విడుదలై అఖండ విజయం సాధించిన ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 25 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.. కృష్ణ – జయప్రద, శోభన్ బాబు – శ్రీదేవి ప్రధాన తారాగణంగా.. కైకాల, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, గిరిబాబు, సూర్యకాంతం, చలపతి రావు, అన్నపూర్ణ తదితరులు కీలకపాత్రల్లో నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ పిక్చర్ ‘ముందడుగు’..
మూవీ మొఘల్ డా. డి. రామా నాయుడు నిర్మాత.. కె. బాపయ్య దర్శకుడు.. కె. చక్రవర్తిత సంగీత దర్శకుడు.. కృష్ణ – బాల గంగాధర్ తిలక్, శోభన్ బాబు – చక్రవర్తి, జయప్రద – రాణి, శ్రీదేవి – భారతి పాత్రల్లో కనిపించారు.. ఆకట్టుకునే కథ, కథనాలు.. నటీనటుల సహజమైన నటన, సాంకేతిక నిపుణుల మెరుగైన పనితీరు.. అలరించే పాటలు, నేపథ్య సంగీతం.. ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, సెంటిమెంట్స్, సందర్భానికి తగిన హాస్యం..
ఇలా అన్నిటినీ సమపాళ్లలో మేళవించి తెరకెక్కించిన ‘ముందడుగు’ ఘన విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపించింది.. విడుదలైన అన్ని ముఖ్య కేంద్రాలలో అర్థ శత దినోత్సవం, శత దినోత్సవం, సిల్వర్ జూబ్లీ (175 డేస్) మరియు గోల్డెన్ జూబ్లీ (365 డేస్) జరుపుకోవడం విశేషం..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?