శంకర్ దర్శకుడి విజన్ ను క్యాచ్ చేయడం అనేది అంత ఈజీ మేటర్ కాదు అని తమిళ ఫిల్మ్ మేకర్స్ చాలా గొప్పగా చెబుతుంటారు. తొలి సినిమా ‘జెంటిల్మెన్’ తో బ్లాక్ బస్టర్ అందుకుని కమర్షియల్ డైరెక్టర్ గా పేరొందిన అతను.. ప్రేక్షకులకు సామాన్యమైన వ్యక్తిలా అయితే కనిపించలేదు. అయితే అలాంటి గొప్ప దర్శకుడు తన రెండో సినిమాని హీరో మెటీరియల్ కాని.. ఒక కొరియోగ్రాఫర్ తో చేస్తున్నాడు అంటే.. విమర్శించిన వారు చాలా మందే ఉన్నారు.
ఇతను రెండో సినిమాకే దుకాణం సర్దేస్తాడు అని చెప్పిన వాళ్ళు చాలా మందే ఉన్నారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. అయినా సరే శంకర్ ‘ప్రేమికుడు’ అనే సినిమాని మొదలుపెట్టాడు. ప్రేమ కథ అయినప్పటికీ నిర్మాతతో రూ.3 కోట్లు బడ్జెట్ పెట్టించిన ఘనత కూడా అతనికే చెందింది. నిర్మాత కె.టి.కుంజుమన్ కూడా ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా శంకర్ సినిమాకి భారీగా పెట్టుబడి పెట్టేశాడు. ‘జెంటిల్మెన్ ‘ అందించిన లాభాల వల్ల వచ్చినా కాన్ఫిడెన్స్ అది అని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే 1994 సెప్టెంబర్ 23 న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి అందరి నోర్లు మూయించింది. గవర్నర్ కూతురిని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు ప్రేమించడం అనే లైన్ తో ఈ సినిమా రూపొందింది. అది ఒకింత కాంట్రవర్సీ అయినప్పటికీ.. సినిమా పబ్లిసిటీకి అది బాగా ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలో రూపొందిన పాటలు, ప్రభుదేవా నటన, నగ్మా గ్లామర్..
శంకర్ దర్శకత్వ ప్రతిభ.. కలగలిపి ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా రూ.2 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది అంటే అతిశయోక్తి కాదు. ప్రేమకథా చిత్రాలకు కూడా మార్కెట్ పెరిగేలా చేసింది ఈ (Premikudu) ‘ప్రేమికుడు’ సినిమా..! నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 28 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!