‘రాజా రాణి’ తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ సినిమా ఫేవరెట్ మూవీ అయ్యుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇది డబ్బింగ్(తమిళ్) సినిమానే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ టీవీల్లో తెగ చూస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ టెంప్లేట్స్ తో చాలా మీమ్స్ వస్తుండటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆర్య, నయనతార జంటగా నటించిన ఈ మూవీలో జై, నజ్రియా ఫహాద్ లు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ మూవీ 2014 మార్చి 14న రిలీజ్ అయ్యింది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ‘ఫాక్స్ ఫోర్ స్టూడియోస్’ వారు ఏ.ఆర్.మురుగదాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. నేటితో ఈ మూవీ రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
1) అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళంలో 2013 సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. అదే రోజున మనకు ఇక్కడ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా రిలీజ్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా.. దర్శకుడు అట్లీ నిజానికి మొదట ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలి అనుకోలేదు.
2) ‘రోబో’ చిత్రానికి శంకర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసేవాడు అట్లీ. అటు తర్వాత ‘నన్బన్’ సినిమాకి కూడా అసిస్టెంట్ గా పనిచేశాడు. అదే టైంలో హీరో విజయ్ తో అట్లీకి మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అట్లీ పనితనం విజయ్ కు అమితంగా నచ్చేసింది.
3) ఈ క్రమంలో ‘తుపాకీ’ సినిమాకి కూడా రిఫర్ చేశాడు విజయ్. ‘తుపాకీ’ చిత్రాన్ని మురుగదాస్ డైరెక్ట్ చేయడం జరిగింది. అదే టైంలో విజయ్ కు ‘తేరి’ కథ వినిపించాడు. విజయ్ కు కథ నచ్చింది కానీ ‘దర్శకత్వం అనుభవం లేకుండా మొదటి సినిమాకే అంత మాస్ కథ నువ్వు హ్యాండిల్ చేయలేవు’ అని విజయ్.. అట్లీకి చెప్పాడట.
4) విజయ్ మాటలకు అట్లీ డిజప్పాయింట్ అవ్వలేదు. అయితే విజయ్ స్వయంగా అట్లీ వద్ద మంచి కథ ఉందని మురుగదాస్ కు చెప్పడం జరిగింది. దీంతో మురుగదాస్ కూడా అట్లీని పిలిపించుకుని కథ విన్నాడు. అది మురుగదాస్ కు నచ్చింది. కథ నాకు ఇచ్చేయమని అట్లీని అడిగాడట మురుగదాస్. కానీ ఓ అభిమానిగా ఎప్పటికైనా విజయ్ తో ఆ కథని తీయాలనుకుంటున్నట్టు మురుగదాస్ తో చెప్పాడట అట్లీ. తర్వాత మురుగదాస్ కూడా అట్లీని ఇబ్బంది పెట్టలేదు.
5) అదే టైంలో అట్లీ ముందుగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి తక్కువ బడ్జెట్ లో అయిపోయే కథ రెడీ చేసుకోవాలని తన కాలేజ్ డేస్ ను గుర్తు చేసుకుని ‘రాజా రాణి’ కథను డిజైన్ చేసుకున్నాడు అట్లీ. ఆ కథ ఓ సందర్భంలో మురుగదాస్ కు చెప్పడంతో ఆయన ‘ఫాక్స్ ఫోర్ స్టూడియోస్’ తో కలిసి ఆ చిత్రాన్ని నిర్మిస్తాను అని మాట ఇచ్చారు మురుగదాస్.
6) ఆయన మాట ఇచ్చినట్టే.. ప్రాజెక్టు ఓకే అయ్యేలా చేశారు. ముందుగా జై పాత్ర కోసం నానిని అడిగారు. కానీ నాని ఆ టైంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ , కృష్ణవంశీ దర్శకత్వంలో ‘పైసా’ అనే సినిమాలు చేస్తున్నాడు. అందువల్ల ఈ ప్రాజెక్టులో నటించలేను అని చెప్పాడు.
7) ఫైనల్ గా ఆర్య, జై లు సెట్ అయ్యారు. రూ.10 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అట్లీ. ఓ కొత్త డైరెక్టర్ కు ఆ బడ్జెట్ కూడా ఎక్కువే అన్నట్టు తమిళ జనాలు చూసేవారు.
8) కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఏకంగా రూ.80 కోట్ల పైనే వసూళ్లు సాధించింది. నిర్మాతలకు బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది ‘రాజా రాణి’ చిత్రం. ఈ క్రమంలో అట్లీ పెద్ద బ్యానర్ల నుండి పే చెక్ లు అందాయి.
9) అయితే తెలుగులో మాత్రం ‘రాజా రాణి’ సినిమా అన్ సీజన్లో రిలీజ్ అవ్వడం వలనో ఏమో కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు.బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బిలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. నాని చేసుంటే కచ్చితంగా ఈమూవీ మంచి హిట్ అయ్యుండేదేమో.
10) ‘రాజా రాణి’ శాటిలైట్ హక్కులు మాత్రం ‘మా టీవీ’ వారు రూ.3 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అందువల్ల ఈ మూవీ సేఫ్ అయిపోయింది.
‘రాజా రాణి’ చిత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. యూత్, ఫ్యామిలీ ను విపరీతంగా ఆకట్టుకునే మూవీ ఇది. జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటుంది.