అక్కినేని నాగేశ్వరరావు రెండో కూతురు కొడుకుగా, అక్కినేని నాగార్జున మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. సుమంత్ ను చిన్నతనంలోనే దత్తత తీసుకున్నారు ఏఎన్నార్. తాత, మావయ్య.. ల బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనకు శివ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు కదా అన్ని నమ్మి.. సుమంత్ ను రాంగోపాల్ వర్మ చేతిలో పెట్టాడు నాగార్జున. అలా సుమంత్ – రాంగోపాల్ వర్మ కాంబోలో ‘ప్రేమ కథ’ రూపొందింది.
మ్యూజికల్ గా ఈ మూవీ సూపర్ హిట్. క్లైమాక్స్ తప్ప సినిమా అంతా సూపర్. కానీ క్లైమాక్స్ నిరాశపరచడంతో సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో సుమంత్ రెండవ చిత్రానికి ‘తొలిప్రేమ’ తో సూపర్ హిట్ ఇచ్చిన కరుణాకరన్ ను రంగంలోకి దింపాడు నాగార్జున. ఏఎన్నార్ క్లాప్ తో షూటింగ్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంతో భూమిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రెండు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. 2000 వ సంవత్సరం మే 18న ‘యువకుడు’ రిలీజ్ అయ్యింది.
సినిమాకి ‘తొలిప్రేమ’ లా హిట్ టాక్ అయితే రాలేదు. అలా అని ‘ప్రేమ కథ’ లా ప్లాప్ అని అన్నవాళ్ళు కూడా లేరు. సినిమాలో కామెడీ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాలు బాగా కుదిరాయి. మణిశర్మ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. అయితే ప్రీ క్లైమాక్స్ వద్ద తేడా కొట్టేసింది. అమ్మ సెంటిమెంట్, హీరోయిన్ తో ప్రేమ.. మధ్యలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ ను ఇరికించడంతో జనాలు డైవర్ట్ అయిపోయి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు.
‘గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగార్జునతో కలిసి నితిన్ తండ్రి ఎన్.సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కోసం సుమంత్ కు రూ.5 లక్షల పారితోషికం ఇచ్చాడు నాగార్జున. ఇది ఒక 50 రోజులు ఆడి.. యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ఈరోజుతో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది. థియేటర్లలో అప్పుడు జనాలు (Yuvakudu) ‘యువకుడు’ ని వంద రోజులు బొమ్మగా నిలబెట్టలేకపోయినా.. బుల్లితెర పై అలాగే యూట్యూబ్ లో చూసి ఎంజాయ్ చేసే జనాలు అయితే ఉన్నారు.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!