Abhilasha: 40 ఏళ్ల మెగాస్టార్ చిరంజీవి ‘అభిలాష’ గురించి ఆసక్తికర విషయాలు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎదుగుతున్న సమయంలో.. సుప్రీం హీరోగా మారుతున్న క్రమంలో ఆయన కెరీర్‌కి ‘పునాది రాళ్లు’ వేసిన మరపురాని ‘ఆలయ శిఖరా’ ల్లాంటి చిత్రాలు కొన్ని ఉన్నాయి.. ముఖ్యంగా 1983 సంవత్సరం చిరు నట జీవితంలో ఓ మెమరబుల్ ఇయర్.. ‘ఖైదీ’ గా చిరుని మెగా స్టార్‌ని చేసింది ఆ సంవత్సరమే.. అదే ఏడాది 1983 మార్చి 11న వచ్చిన ‘అభిలాష’ చిత్రం కూడా నటుడిగా చిరుకి మంచి పేరు తీసుకొచ్చింది..

2023 మార్చి 11 నాటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘అభిలాష’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.. చిరంజీవి – రాధిక జంటగా.. ఎ. కోదండ రామి రెడ్డి దర్శకత్వంలో.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కె..ఎస్. రామారావు నిర్మించిన సూపర్ హిట్ ఫిలిం ‘అభిలాష’.. రావు గోపాల రావు, గొల్లపూడి, రాళ్లపల్లి, రాజ్య లక్ష్మీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.. యండమూరి వీరేంద్రనాథ్ ‘అభిలాష’ నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి యండమూరి కథ, జి.సత్యమూర్తి, కోదండ రామిరెడ్డి స్క్రీన్‌ప్లే, యండమూరి – సత్యమూర్తి మాటలు రాశారు..

ఆత్రేయ – వేటూరి పాటలందించారు.. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతమందించారు.. తన తండ్రికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని.. ఇపీఎస్‌లోని 302 శిక్షాస్మృతిని రద్దు చేయించడానికి పెద్దగా ప్రాక్టీసు లేని చిరంజీవి అనే యువకుడు చేసిన సాహసోపేతమైన పోరాటం.. అనుకున్నది సాధించడమే అతని ‘అభిలాష’ అనేది కథ.. చిరంజీవి సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.. సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ ఇళయ రాజా పాటలు, నేపథ్య సంగీతం..

పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.. ‘నవ్వింది మల్లెచెండు.. నచ్చింది గర్ల్ ఫ్రెండ్’, ‘యురేకా’, ‘బంతీ చామంతీ’, ‘సందెపొద్దల కాడ’ సాంగ్స్ అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. చిరు స్టెప్పులు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి.. ‘అభిలాష’ తర్వాత కొన్ని నెలల వ్యవధి తర్వాత వచ్చిన ‘ఖైదీ’ మూవీతో చిరు కెరీర్ గ్రాఫ్ మారిపోయింది..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus