Pathala Bhairavi: 72 ఏళ్ల ‘పాతాళ భైరవి’ గురించి ఆసక్తికర విషయాలు..!

‘పాతాళ భైరవి’.. తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చిత్రం.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే.. ఎలాంటి సాంకేతిక అందుబాటులో లేనప్పుడే ఇలాంటి పాంటసీ ఫిలిం చేయాలనే ఆలోచన రావడం.. అనుకున్నదాన్ని అత్యద్భుతంగా తీసి.. చరిత్రలో నిలిచిపోయేలా చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి.. విజయ వాహిని స్టూడియోస్ బ్యానర్ మీద కె.వి. రెడ్డి దర్శకత్వంలో.. నాగిరెడ్డి – చక్రపాణి నిర్మించిన అద్భుత కళాఖండం ‘పాతాళ భైరవి’ 1951 మార్చి 15న విడుదలైంది.. 2023 మార్చి 15 నాటికి 72 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..

మాలతి, సిఎస్ఆర్ ఆంజనేయులు, రేలంగి, గిరిజ, సురభి కమాలాభాయి, కృష్ణ కుమారి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.. తోటరాముడిగా నటరత్న ఎన్టీఆర్, నేపాళ మాంత్రికుడిగా విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ ఇద్దరూ సినిమాకు వెన్నెముకగా నిలిచారు.. నటనలోనూ పోటాపోటీగా చేశారు.. రాజకుమారి ఇందుమతిగా మాలతి కనిపించారు.. కథ, క్యారెక్టర్లు, కథనం, నేపథ్య సంగీతం, సెట్టింగులు, ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే అద్భుతమై గ్రాఫిక్స్ అయితే నమ్మశక్యం కావు.. ఘంటసాల పాటలు ఎవర్ గ్రీన్.. మార్కస్ బార్ట్లీ కెమెరా మాయాజాలం సినిమాకు ప్రాణం పోశాయి..

ఎవరో పుట్టించనిదే మాటలెలా పుడతాయి?.. ఇప్పటికీ వినిపించే పాపులర్ డైలాగ్స్..

‘‘సాహసం సాయరా డింభకా.. రాకుమారి దక్కునురా..
మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా..
జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?..
జై పాతాళ భైరవి.. సాష్తాంగ నమస్కారం సేయరా డింభకా’’..

అరుదైన ఘనత సాధించిన ‘పాతాళ భైరవి’..

1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం ‘పాతాళ భైరవి’..

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం కూడా ఇదే.. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది.

1980లలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయా సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో, కలర్‌లో తీశారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus